నవ్యాంధ్రకు సకుటుంబంగా వెళ్తారా ...?
ఏపీలో పని చేయడానికి కుటుంబంతో సహా వెళ్లే ఉద్యోగుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకోసం రాష్ట్ర సచివాలయంలోని అన్ని శాఖాధిపతులు, కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రత్యేక సర్క్యులర్‌ను మంగళవారం సీఎస్ కృష్ణారావు జారీ చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి మరియు ఏపీలోని ఏ ప్రాంతంలోనైనా పని చేసేందుకు కుటుంబంతో సహా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? లేదా? తెలపండి. అక్కడకు వెళ్లేందుకు ఏమైనా వెసులుబాటు, మినహాయింపులు కోరుతున్న పక్షంలో వాటిని కూడా జత […]
Advertisement
ఏపీలో పని చేయడానికి కుటుంబంతో సహా వెళ్లే ఉద్యోగుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకోసం రాష్ట్ర సచివాలయంలోని అన్ని శాఖాధిపతులు, కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రత్యేక సర్క్యులర్‌ను మంగళవారం సీఎస్ కృష్ణారావు జారీ చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి మరియు ఏపీలోని ఏ ప్రాంతంలోనైనా పని చేసేందుకు కుటుంబంతో సహా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? లేదా? తెలపండి. అక్కడకు వెళ్లేందుకు ఏమైనా వెసులుబాటు, మినహాయింపులు కోరుతున్న పక్షంలో వాటిని కూడా జత చేసి నిర్ణయాన్ని వారంరోజుల్లోగా తెలియచేయాలని సీఎస్ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఉద్యోగుల పిల్లల ఏపీ స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ తీసుకురావాలని ఉద్యోగసంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ సర్క్యలర్‌ను జారీ చేసింది. శాఖాధిపతులకు ఉద్యోగుల వివరాలు అందిన తర్వాత ఏపీ కుటుంబంతో సహా వెళ్లేవారి సంఖ్య, విముఖంగా ఉన్నవారి సంఖ్య స్పష్టంగా తెలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Advertisement