పచ్చ చొక్కాలకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు?
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని ఉద్యోగాలకు సీఎం చంద్రబాబు రాజకీయ రంగు పులుముతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ పథకంలో పని చేస్తున్న వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం ఇటీవలే మూకుమ్మడిగా తొలగించింది. 1,660 గ్రామాల్లో కొత్తవారి ఎంపికను తక్షణమే చేపట్టాలని ఆదేశించింది. అయితే నియామక ప్రక్రియను మాత్రం అధికారులకు బదులుగా జన్మభూమి కమిటీలకు అప్పగించింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్వహణలో అభ్యర్ధుల ఎంపిక పారదర్శకంగా జరగాల్సి ఉండగా, వాటిని గ్రామ జన్మభూమి […]
Advertisement
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని ఉద్యోగాలకు సీఎం చంద్రబాబు రాజకీయ రంగు పులుముతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ పథకంలో పని చేస్తున్న వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం ఇటీవలే మూకుమ్మడిగా తొలగించింది. 1,660 గ్రామాల్లో కొత్తవారి ఎంపికను తక్షణమే చేపట్టాలని ఆదేశించింది. అయితే నియామక ప్రక్రియను మాత్రం అధికారులకు బదులుగా జన్మభూమి కమిటీలకు అప్పగించింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్వహణలో అభ్యర్ధుల ఎంపిక పారదర్శకంగా జరగాల్సి ఉండగా, వాటిని గ్రామ జన్మభూమి కమిటీలకు అప్పగించడం ఏమిటని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ విధానం వల్ల టీడీపీ కార్యకర్తలు, వారి అనుచరులకే ఫీల్డ్ ఆఫీసర్ల ఉద్యోగాలు దక్కుతాయని వారు ఆరోపిస్తున్నారు.
Advertisement