గుండెపోటుతో నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే మృతి

నారాయణఖేడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పటోళ్ళ కిష్టారెడ్డి మృతి చెందారు. నిద్రపోతున్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మెలితిరిగిపోతూ కుప్పకూలిపోయారు. హైదరాబాద్‌లోని ఎస్‌.ఆర్‌.నగర్‌లో ఆయన నివాస గృహంలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌కు చెందిన కిష్టారెడ్డి రెండున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. 1989, 1999, 2009, 2014లో ఆయన నారాయణ్‌ఖేడ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన కిష్టారెడ్డి అంచలంచెలుగా […]

Advertisement
Update:2015-08-25 05:46 IST
నారాయణఖేడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పటోళ్ళ కిష్టారెడ్డి మృతి చెందారు. నిద్రపోతున్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మెలితిరిగిపోతూ కుప్పకూలిపోయారు. హైదరాబాద్‌లోని ఎస్‌.ఆర్‌.నగర్‌లో ఆయన నివాస గృహంలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌కు చెందిన కిష్టారెడ్డి రెండున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. 1989, 1999, 2009, 2014లో ఆయన నారాయణ్‌ఖేడ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన కిష్టారెడ్డి అంచలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి చేరారు. 67 సంవత్సరాల ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. కిష్టారెడ్డి ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ ఒక సీనియర్‌ నాయకుడ్ని కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
Tags:    
Advertisement

Similar News