చీప్ లిక్కర్ అమృతం: మంత్రి పద్మారావు
పది రూపాయలకు దొరికే గుడుంబా ప్రజల పాలిట విషం. ప్రభుత్వం అందించబోయే రూ. 15కు చీప్ లిక్కర్ ప్రజలకు అమృతంతో సమానమని ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు అన్నారు. పేదల ఆయుష్షును పెంచడానికే ప్రభుత్వం నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకు రానుందని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. చీప్‌లిక్కర్ వల్ల ప్రభుత్వ ఖజానాకు భారమైనా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుందని అన్నారు. చీప్‌లిక్కర్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతం అర్థరహితమని ఆయన విమర్శించారు. గుడుంబా […]
Advertisement
పది రూపాయలకు దొరికే గుడుంబా ప్రజల పాలిట విషం. ప్రభుత్వం అందించబోయే రూ. 15కు చీప్ లిక్కర్ ప్రజలకు అమృతంతో సమానమని ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు అన్నారు. పేదల ఆయుష్షును పెంచడానికే ప్రభుత్వం నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకు రానుందని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. చీప్‌లిక్కర్ వల్ల ప్రభుత్వ ఖజానాకు భారమైనా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుందని అన్నారు. చీప్‌లిక్కర్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతం అర్థరహితమని ఆయన విమర్శించారు. గుడుంబా వల్ల వందలాదిమంది పేదలు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చీప్‌లిక్కర్ వల్ల ఎలాంటి హానీ జరగదని, అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోందని ఆయన చెప్పారు.
Advertisement