కేంద్రానికి సన్నిహితుడనే రక్షణశాఖతో ఒప్పందం
రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ సంస్థతో రక్షణ మంత్రి చేసుకున్న డిఆర్‌డిఎ ఒప్పందంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కేంద్రం ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి పతంజలి సంస్థతో మూలికా ఉత్పత్తులు, వాటి పంపిణీ కోసం రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆర్జేడీ నేత మనోజ్ ఝూ ఆరోపించారు. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్రభుత్వం కనీస నియమ నిబంధనలను కూడా పాటించలేదని ఆయన ఆరోపించారు. టెండర్లను పిలవకుండా అత్యంత రహస్యంగా ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం […]
Advertisement
రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ సంస్థతో రక్షణ మంత్రి చేసుకున్న డిఆర్‌డిఎ ఒప్పందంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కేంద్రం ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి పతంజలి సంస్థతో మూలికా ఉత్పత్తులు, వాటి పంపిణీ కోసం రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆర్జేడీ నేత మనోజ్ ఝూ ఆరోపించారు. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్రభుత్వం కనీస నియమ నిబంధనలను కూడా పాటించలేదని ఆయన ఆరోపించారు. టెండర్లను పిలవకుండా అత్యంత రహస్యంగా ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏమిటని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీకి సన్నిహితుడనే కారణంగా రాందేవ్ బాబాకు లబ్ది చేకూర్చడానికే కేంద్రం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుందని ఆయన విమర్శించారు.
Advertisement