స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలివే...
భారత స్టాక్ మార్కెట్ సోమవారం భారీ పతనాన్ని చవి చూసింది. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఇన్వెస్టర్లు ఒక్క రోజే సుమారు 7 లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు. స్టాక్‌మార్కెట్ భారీ పతనం వెనుక చైనా, అమెరికాల ప్రభావం ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చైనా ఆర్థికవ్యవస్థలో స్తబ్దతతోపాటు పెన్షన్ నిధులను స్టాక్ మార్కెట్ ఈక్విటీల్లో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించడం ఆసియన్ మార్కెట్లపై ప్రభావం చూపింది. గత వారం చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించడం, 30 […]
Advertisement
భారత స్టాక్ మార్కెట్ సోమవారం భారీ పతనాన్ని చవి చూసింది. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఇన్వెస్టర్లు ఒక్క రోజే సుమారు 7 లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు. స్టాక్‌మార్కెట్ భారీ పతనం వెనుక చైనా, అమెరికాల ప్రభావం ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చైనా ఆర్థికవ్యవస్థలో స్తబ్దతతోపాటు పెన్షన్ నిధులను స్టాక్ మార్కెట్ ఈక్విటీల్లో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించడం ఆసియన్ మార్కెట్లపై ప్రభావం చూపింది. గత వారం చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించడం, 30 శాతం పెన్షన్ నిధులను స్టాక్ మార్కెట్‌కు తరలించాలని భావించడంతో ఆ దేశం పనితీరుపై అంతర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అమెరికాలోని తయారీ రంగం తీవ్ర ఒడిదుడుకులను చవిచూస్తోందన్న వార్తలు కూడా భారత స్టాక్ మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. గ్రీసు ప్రధాని రాజీనామా, చమురు రంగంలో ఏర్పడిన సంక్షోభంతోపాటు భారీగా విదేశీ సంస్థాగత మదుపరులు తరలిపోతున్నారన్న సమాచారం కూడా మార్కెట్ పతనానికి కారణమైంది.
Advertisement