కర్ణాటకలో కాంగ్రెస్ ఢమాల్... బీజేపీ హవా!
బెంగుళూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయదుందుబి మోగించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు దిమ్మ తిరిగిపోయేట్టు చేశాయి. మొత్తం 197 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 100 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలను దక్కించుకుంది. ఇక మరో ప్రతిపక్ష పార్టీ జనతాదళ్ (ఎస్) స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇతరులు 8 స్థానాలు దక్కించుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పెద్ద సంఖ్యలో […]
Advertisement
బెంగుళూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయదుందుబి మోగించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు దిమ్మ తిరిగిపోయేట్టు చేశాయి. మొత్తం 197 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 100 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలను దక్కించుకుంది. ఇక మరో ప్రతిపక్ష పార్టీ జనతాదళ్ (ఎస్) స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇతరులు 8 స్థానాలు దక్కించుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. బెంగుళూరు కార్పొరేషన్ ఫలితాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పాలనకు రిఫరెండమని బీజేపీ వ్యాఖ్యానించగా… బీజేపీ నాయకులు ప్రలోభాలకు గురి చేయడం వల్లే తమకు తక్కువ సీట్లు వచ్చాయని అధికారపార్టీ నాయకులంటున్నారు. ప్రధానమంత్రి మోడీ కర్ణాటకలోని బీజేపీ నాయకులకు అభినందనలు తెలిపారు. తమ పార్టీకి కార్పోరేషన్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కట్టబెట్టినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement