రాష్ట్రంలో వర్సిటీల ప్రక్షాళన: మంత్రి గంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీని మంత్రి గంటా అకస్మికంగా సందర్శించారు. అనంతరం అధికారులతో సమావేశమై ర్యాగింగ్ నిరోధక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ పనితీరు మార్చుకొని వీసీలను సైతం పదవుల నుండి తొలగించుకొనే విధంగా చట్టాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీల్లో తిష్ట వేస్తున్న బయటి వ్యక్తులను ఉపేక్షించేది లేదని, వారిని బయటకు పంపేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
Advertisement