కృష్ణా డెల్టాలో వ‌రికి ఉరే!

వ‌రి పంట‌కు ఈ ఖ‌రీఫ్‌లో ఉరి వేయ‌బోతున్నారు. ఈ సీజ‌న్‌లో ఇక‌ వ‌రి సాగు చేయ‌వ‌ద్ద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రైతుల‌కు సూచించ‌బోతున్న‌ది. కీష్ణా డెల్టాకు నీరు అందే ఆశ‌లు స‌న్న‌గిల్లిపోవ‌డంతో ఆయ‌క‌ట్టు రైతుల‌కు ప్ర‌భుత్వం ఇలాంటి స‌ల‌హా ఇవ్వ‌బోతున్న‌ట్లు సంకేతాలందుతున్నాయి. ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌కు మ‌ళ్లాల్లిందిగా ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి చేయ‌బోతున్న‌ది. ఈ సీజ‌న్‌లో రాయ‌ల‌సీమ‌తో పాటు కోస్తా జిల్లాల్లోని ప‌శ్చిమ ప్రాంత‌మంతా క‌రువు అల‌ముకుంది. అందుకే అత్య‌వ‌స‌ర ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. ఇప్ప‌టికే 208 […]

Advertisement
Update:2015-08-24 05:00 IST
వ‌రి పంట‌కు ఈ ఖ‌రీఫ్‌లో ఉరి వేయ‌బోతున్నారు. ఈ సీజ‌న్‌లో ఇక‌ వ‌రి సాగు చేయ‌వ‌ద్ద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రైతుల‌కు సూచించ‌బోతున్న‌ది. కీష్ణా డెల్టాకు నీరు అందే ఆశ‌లు స‌న్న‌గిల్లిపోవ‌డంతో ఆయ‌క‌ట్టు రైతుల‌కు ప్ర‌భుత్వం ఇలాంటి స‌ల‌హా ఇవ్వ‌బోతున్న‌ట్లు సంకేతాలందుతున్నాయి. ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌కు మ‌ళ్లాల్లిందిగా ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి చేయ‌బోతున్న‌ది. ఈ సీజ‌న్‌లో రాయ‌ల‌సీమ‌తో పాటు కోస్తా జిల్లాల్లోని ప‌శ్చిమ ప్రాంత‌మంతా క‌రువు అల‌ముకుంది. అందుకే అత్య‌వ‌స‌ర ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. ఇప్ప‌టికే 208 మండ‌లాల్లో తీవ్ర వ‌ర్షాభావం నెల‌కొంది. మ‌రో 142 మండ‌లాల‌దీ అదే ప‌రిస్థితి. అందుకే వీట‌న్నిటిలోనూ ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక అమ‌లు చేయాల్సి ఉంది. అయితే ఈ సీజ‌న్‌లో క‌రువు చాయ‌లు ముందే క‌నిపించాయి. వ‌ర్షాభావం ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తున్నా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆల‌స్యంగా మేలుకొంది. క‌రువు ప్ర‌ణాళిక‌లు ఇప్ప‌టికే త‌యారు కావ‌ల‌సి ఉన్నా మంత్రులు ఇప్పుడే మేల్కొన్నారు. ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చి నారు పోసుకున్న కృష్ణా డెల్టా రైతుల పరిస్థితి ఇపుడు అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. శ్రీ‌శైలం నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుద‌ల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. అందుకే ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌వైపు మ‌ర‌లాల్సిందిగా రైతుల‌కు విజ్ఞ‌ప్తి చేయాల‌ని చూస్తోంది. వ‌ర్షాభావం ఉన్న ప్రాంతాల‌లో ప్ర‌త్యామ్నాయ పంట‌ల గురించి ఆచార్య ఎన్‌జీ రంగా వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం ఒక నివేదిక అందించింది. నేల‌ల స్వ‌భావం, వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి 13 జిల్లాల‌ను ఐదు జోన్లుగా విభ‌జించి ఎక్క‌డెక్క‌డ ఏఏ పంట‌లు వేసుకోవాలో సూచించింది. ఆ నివేదిక‌ను బ‌ట్టి కృష్ణా డెల్టాలో వ‌రికి స్వ‌స్తి ప‌ల‌కాల్సిందేన‌ని తెలుస్తోంది. డెల్టాలో పత్తి, ఆముదాలు, కంది, పొద్దుతిరుగుడు మిరప సాగుచేయాల‌ని నివేదిక‌లో పేర్కొన్నారు. రాయ‌ల‌సీమ‌లో నూనెగింజ‌ల సాగు ఆపాల‌ని, వేరుశ‌న‌గ‌కు ప్ర‌త్యామ్నాయంగా పొద్దుతిరుగుడు, జొన్న, సజ్జ, కంది, పెసలు, ఉలవలు, ఆముదాలు, గోరుచిక్కుడు, ఉల్లి సాగుచేసుకోవ‌చ్చ‌ని నివేదిక సూచిస్తోంది.
Tags:    
Advertisement

Similar News