ప్రైవేట్ రిజర్వేషన్ల కోసం ఉద్యమం
ఆర్థిక, సరళీకరణ విధానాలతో ప్రభుత్వ రంగ పరిధి తగ్గుతున్నందున ఇకపై ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రైవేట్ రిజర్వేషన్ల రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జాడి ముసలయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాడి ముసలయ్య మాట్లాడుతూ రిజర్వేషన్ల వల్ల మెరిట్ తగ్గుతుందన్నది అపోహ మాత్రమేనని అన్నారు. దేశం వెనకబడి పోవడానికి కులాలే కారణమని ఆయన అన్నారు. […]
Advertisement
ఆర్థిక, సరళీకరణ విధానాలతో ప్రభుత్వ రంగ పరిధి తగ్గుతున్నందున ఇకపై ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రైవేట్ రిజర్వేషన్ల రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జాడి ముసలయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాడి ముసలయ్య మాట్లాడుతూ రిజర్వేషన్ల వల్ల మెరిట్ తగ్గుతుందన్నది అపోహ మాత్రమేనని అన్నారు. దేశం వెనకబడి పోవడానికి కులాలే కారణమని ఆయన అన్నారు. తెలంగాణలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ప్రభుత్వం కేవలం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయడం అన్యాయమని, ఉద్యోగాలు ప్రభుత్వాలు వేసే భిక్ష కాదని, ప్రజల హక్కని ఆయన అన్నారు. ఈ సదస్సులో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, పిఆర్‌పిఎస్ రాష్ట్ర కో చైర్మన్ భూక్యా భంగ్యా తదితర్లు పాల్గొన్నారు.
Advertisement