నిర్మాణంపై సీపీఎం పునరాలోచన!
మళ్లీ సాల్కియా తరహాలో జాతీయ ప్లీనం పార్టీ సంస్థాగత నిర్మాణంపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) దృష్టిపెట్టింది. మరోమారు అఖిలభారత స్థాయి విస్తృత సమావేశం (ప్లీనం) నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో పార్టీ నిర్మాణ నివేదికపై 1978లో పశ్చిమబెంగాల్‌లోని సాల్కియాలో నిర్వహించిన ప్లీనంలో చర్చించి తుదిరూపునిచ్చారు. ఇప్పటి వరకు సీపీఎం ఆ నిర్మాణ నివేదికను అనుసరిస్తూనే ముందుకు పురోగమిస్తున్నది. 37 ఏళ్ల తర్వాత ఇపుడు దానిపై చర్చకు పార్టీ ఉపక్రమిస్తున్నది. మారిన పరిస్థితుల నేపథ్యంలో మరోమారు నిర్మాణ నివేదికపై […]
Advertisement
మళ్లీ సాల్కియా తరహాలో జాతీయ ప్లీనం
పార్టీ సంస్థాగత నిర్మాణంపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) దృష్టిపెట్టింది. మరోమారు అఖిలభారత స్థాయి విస్తృత సమావేశం (ప్లీనం) నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో పార్టీ నిర్మాణ నివేదికపై 1978లో పశ్చిమబెంగాల్‌లోని సాల్కియాలో నిర్వహించిన ప్లీనంలో చర్చించి తుదిరూపునిచ్చారు. ఇప్పటి వరకు సీపీఎం ఆ నిర్మాణ నివేదికను అనుసరిస్తూనే ముందుకు పురోగమిస్తున్నది. 37 ఏళ్ల తర్వాత ఇపుడు దానిపై చర్చకు పార్టీ ఉపక్రమిస్తున్నది. మారిన పరిస్థితుల నేపథ్యంలో మరోమారు నిర్మాణ నివేదికపై విస్తృత స్థాయిలో చర్చ జరిపి మార్పులు చేర్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నది. సాల్కియా తరహాలో మరోమారు అఖిల భారత స్థాయి ప్లీనం నిర్వహించాలని పార్టీ కేంద్ర కమిటీ సమావేశం నిర్ణయించింది. మూడు రోజుల పాటు న్యూఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇపుడు కూడా ఈ జాతీయ ప్లీనంకు పశ్చిమబెంగాల్ రాష్ట్రమే వేదిక కాబోతున్నది. కొల్‌కతాలో డిసెంబర్‌లో ప్లీనం నిర్వహించాలని నిర్ణయించారు. తేదీలను తర్వాత ప్రకటిస్తారు. పార్టీ నిర్మాణ బలం, బలహీనతలపై మదింపు వేయడానికి గాను నిర్వహించే ఈ సమావేశాలలో క్షేత్రస్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఎంపిక చేసిన ప్రతినిధులంతా హాజరవుతారు. ప్లీనంకు సన్నాహక చర్యగా పార్టీ రాష్ట్ర కమిటీలు అందించిన నివేదికలు, నిర్దిష్ట సమస్యలు, వాటి పరిష్కార మార్గాల ఆధారంగా పార్టీ పొలిట్‌బ్యూరో ఒక ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తోందని పార్టీ వర్గాలు వివరించాయి. దానిని ప్లీనంలో చర్చకు పెడతారని ఆ వర్గాలు వివరించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో విశాఖలో జరిగిన పార్టీ 21వ అఖిలభారత మహాసభలలోనే నిర్మాణ నివేదికపై సాల్కియా తరహాలో ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కొల్‌కతా ప్లీనంలో మార్పులు చేర్పుల తర్వాత విడుదలయ్యే నిర్మాణ నివేదిక మరి కొన్ని దశాబ్దాల వరకు సీపీఎంకు మార్గదర్శకంగా ఉంటుంది.
Advertisement