ఆరోగ్య సేవలకు 108 స్థానంలో ఇక 112
అత్యవసర సేవల కోసం దేశవ్యాప్తంగా ఒకే నంబరును అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. నేషనల్ వైడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ( ఎన్ఈఆర్ఎస్) పేరుతో కేంద్ర హోంశాఖ మైక్రో మిషన్‌ను చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం టెలికాం శాఖ 112 నంబరును కేటాయించింది. దీంతో త్వరలో దేశవ్యాప్తంగా అంబులెన్స్ సేవల కోసం 112 నంబరు అందుబాటులోకి రానుంది. రాష్ట్రాల్లో అమలవుతున్న 102,108 సేవలు కూడా త్వరలో 112 నంబరు పరిధిలోకి రానున్నాయి. అత్యవసర సర్వీసుల కోసం దేశవ్యాప్తంగా […]
Advertisement
అత్యవసర సేవల కోసం దేశవ్యాప్తంగా ఒకే నంబరును అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. నేషనల్ వైడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ( ఎన్ఈఆర్ఎస్) పేరుతో కేంద్ర హోంశాఖ మైక్రో మిషన్‌ను చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం టెలికాం శాఖ 112 నంబరును కేటాయించింది. దీంతో త్వరలో దేశవ్యాప్తంగా అంబులెన్స్ సేవల కోసం 112 నంబరు అందుబాటులోకి రానుంది. రాష్ట్రాల్లో అమలవుతున్న 102,108 సేవలు కూడా త్వరలో 112 నంబరు పరిధిలోకి రానున్నాయి. అత్యవసర సర్వీసుల కోసం దేశవ్యాప్తంగా 36 చోట్ల 24 గంటలూ పని చేసే కాల్‌సెంటర్‌ను కూడా ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా 112 నంబరు సేవలందిస్తాయి. మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం కేంద్రం అందిస్తే, సిబ్బంది, వాహనాలను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి.
Advertisement