ఫీజు బకాయిల కోసం విద్యార్థుల ఆందోళన
విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు బడ్జెట్ విడుదల చేయకపోవడంతో లక్షలాది విద్యార్థులు తమ చదువులను అర్ధంతరంగా నిలిపివేసే పరిస్థితి దాపురించిందని టీఎన్‌ఎస్‌ఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు చిలుక మధుసూధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండు చేశారు.
Advertisement