నా చిత్తశుద్ధి శంకిస్తే నేనేంటో చూపిస్తా: వపన్‌కల్యాణ్
మిత్రపక్షం అంటే బానిసకాదని, అన్నయ్య (చిరంజీవి) విధానాలకు భిన్నంగా, ఆయన మనసు గాయపరిచి ప్రజల పక్షాన నిలిచానని, అలాంటి నా చిత్తశుద్ధిని శంకిస్తే నేనేంటో చూపిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఏపీ రాజధాని భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన గ్రామాల్లో పర్యటన నిమిత్తం ఆదివారం పెనుమాక వచ్చిన ఆయన అక్కడ రైతులతో ముఖాముఖి చర్చలు జరిపిన అనంతరం మాట్లాడుతూ తాను చేసిన ట్వీట్‌లకు సమాధానంగా తెలుగుదేశం మంత్రులు ఇష్టానుసారంగా మాట్టాడుతున్నారని, తేలిక భావంతో మాట్టాడుతున్నారని […]
Advertisement
మిత్రపక్షం అంటే బానిసకాదని, అన్నయ్య (చిరంజీవి) విధానాలకు భిన్నంగా, ఆయన మనసు గాయపరిచి ప్రజల పక్షాన నిలిచానని, అలాంటి నా చిత్తశుద్ధిని శంకిస్తే నేనేంటో చూపిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఏపీ రాజధాని భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన గ్రామాల్లో పర్యటన నిమిత్తం ఆదివారం పెనుమాక వచ్చిన ఆయన అక్కడ రైతులతో ముఖాముఖి చర్చలు జరిపిన అనంతరం మాట్లాడుతూ తాను చేసిన ట్వీట్‌లకు సమాధానంగా తెలుగుదేశం మంత్రులు ఇష్టానుసారంగా మాట్టాడుతున్నారని, తేలిక భావంతో మాట్టాడుతున్నారని ఆయన విమర్శించారు. మంత్రులు రావెల, యనమల, ప్రతిపాటి మాట్టాడుతూ రకరకాల వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. విభజన వల్ల ఏపీకి తీరని అన్యాయం జరిగిందని, అనుభవం ఉన్న నేత కావాలనే చంద్రబాబు నాయుడుకు మద్దతిచ్చానని, రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతం కావాలనేది తన కోరిక అని పవన్ వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని, ఆ అన్యాయాన్ని తీర్చగల సత్తా ఉన్న నాయకుడిగా చంద్రబాబును అనుకునే మద్దతిచ్చానని పవన్ తెలిపారు. సరైన మార్గంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ముందుకు తీసుకువెళ్లడానికి తనకు చంద్రబాబు, జగన్ కనిపించారని, ఆ ఇద్దరిలో చూస్తే అనుభవం ఉన్న నాయకుడుగా చంద్రబాబు కనిపించారని, పాదయాత్ర చేశారని, ప్రజల, రైతుల కష్టాలు తెలుసుకున్నారని, సమర్థవంతమైన నాయకుడుగా ఆయన కనిపించారని, అందుకే మద్దతిచ్చారని ఆయన వివరించారు. కేంద్రాన్ని స్పెషల్ ప్యాకేజీ కోరాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా పవన్ తెలిపారు.
Advertisement