పార్టీలకు సమదూరం నా సిద్ధాంతం: పవన్‌కల్యాణ్
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు రాజధాని ప్రాంతంలో అపూర్వ స్వాగతం లభించింది. ఈ ప్రాంత రైతులతో మాట్లాడడానికి వచ్చిన ఆయన వద్ద అన్నదాతలంతా తమ గోడును వినిపించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తనకు ఒక పార్టీ ఎక్కువ, మరో పార్టీ తక్కువ కాదని, తాను ప్రజల పక్షమని పవన్ స్పష్టం చేశారు. తాను అభివృద్ధికి ఆటంకం కలిగించేవాడనని టీడీపీలో కొంత మంది విమర్శిస్తున్నారని, అలా అనుకుంటే తాను ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతు ఇస్తానని పవన్ ప్రశ్నించారు. అన్ని […]
Advertisement
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు రాజధాని ప్రాంతంలో అపూర్వ స్వాగతం లభించింది. ఈ ప్రాంత రైతులతో మాట్లాడడానికి వచ్చిన ఆయన వద్ద అన్నదాతలంతా తమ గోడును వినిపించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తనకు ఒక పార్టీ ఎక్కువ, మరో పార్టీ తక్కువ కాదని, తాను ప్రజల పక్షమని పవన్ స్పష్టం చేశారు. తాను అభివృద్ధికి ఆటంకం కలిగించేవాడనని టీడీపీలో కొంత మంది విమర్శిస్తున్నారని, అలా అనుకుంటే తాను ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతు ఇస్తానని పవన్ ప్రశ్నించారు. అన్ని పార్టీలకు తాను సమదూరంలో ఉంటానని, తనకు వ్యక్తిగతంగా ఎవరూ శత్రువులు లేరని వైసీపీని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. నన్ను రాజకీయాల్లోకి అవగాహన తెచ్చిన పరిస్థితులు రెండే రెండని, ఒకటి శాంతి భద్రతల సమస్య, మరొకటి ఆడపిల్లల రక్షణ బాధ్యత… ఈ రెండింటిపై పోరాటానికి తాను రాజకీయాల్లోకి రావాలని భావించానని పవన్ తెలిపారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి లేకుండా రాష్ట్ర విభజన చేసిందని, ఎక్కడో ఒక చోట సమస్య ఉంటుందని, దాన్ని పరిష్కరించుకోవలసిన బాధ్యత మనపైనే ఉంటుందని ఆయన అన్నారు. వీధి పోరాటాలు చేయడానికి మనం పార్టీలు పెట్టుకోనవసరం లేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలు అవసరం లేదని… కానీ మాటలు ద్వారా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చునని, ఆ ఉద్దేశంతోనే వచ్చానని ఆయన చెప్పారు. టీడీపీతోగానీ, సీఎం చంద్రబాబు నాయుడుగాని గొడవ పెట్టుకోడానికి రాలేదని పవన్ స్పష్టం చేశారు. గొడవలు పెట్టుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావు… అలా అవుతాయంటే నేను దానికి కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. టీడీపీ, బీజేపీకి మద్ధతు ప్రకటించడానికి కారణం రాజధాని లేకుండా, ఒక పద్ధతి లేకుండా కాంగ్రెస్ చేసిన విభజన తీరు బాధ వేసిందని అన్నారు. అలా విభజన జరగడంవల్లే ఏపీలో మనకీ సమస్యలు వచ్చాయని పవన్ అన్నారు.
అన్నదాత కన్నీళ్ళతో రాజధాని కడతారా?
అన్నదాత కన్నీళ్ళతో రాజధాని కట్టడం మంచిది కాదని, నమ్మిన సిద్ధాంతం కోసం తండ్రి తర్వాత తండ్రిలాంటి అన్నయ్యనే వదిలేసి బయటికి వచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు. రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతాన్ని చూడాలన్నది తన కోరిక చెప్పారు. రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్‌కల్యాణ్ భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక ప్రశ్నలు వేశారు. ఆఫ్ట్రాల్.. మూడు వేల ఎకరాల కోసం ఎందుకింత రాద్ధాంతం? అని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు అనడాన్ని తప్పుపట్టారు. సినీనటుడు, ఎంపీ మురళీమోహన్‌కు ఎన్నో ఆస్తులున్నాయని, అలాంటి వ్యక్తి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ తన భూమి పోతుందన్న కారణంతో కోర్టుకెళ్ళలేదా అని ప్రశ్నించారు. మురళీ మోహన్ వంటి వ్యక్తి కోర్టుకెక్కినప్పుడు, భూమిపై ఆధారపడి జీవితాన్ని గడుపుతున్న రైతులు దాని కోసం పోరాడటంలో తప్పేముందని ప్రశ్నించారు. రైతుకు అన్నం పెడుతున్న భూమి విషయంలో మంత్రి కిషోర్ బాబు వ్యాఖ్యలు స్థాయికి తగ్గట్టు లేవని పవన్ అన్నారు.
Advertisement