జర్నలిస్టులకు 10 లక్షల బీమా ఇళ్ల స్థలాలు

రాష్ట్రంలోని పాత్రికేయులందరికీ రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు మంత్రి పల్లె రఘునాథరెడ్డి చె ప్పారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాల యంలో శనివారం భేటీ అనంతరం పల్లె మీడియాతో మాట్లాడారు. సమావేశంలో పాత్రి కేయుల సంక్షేమంపై సీఎం దృష్టి సారించారని తెలిపారు. జిల్లాల వారీగా అర్హతలు ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలోని పాత్రికేయులందరికీ ఇప్పటికే హెల్త్‌ కార్డులు అందజేశామని తెలిపారు. ప్రమాదం తీవ్రంగా […]

Advertisement
Update:2015-08-22 18:36 IST
రాష్ట్రంలోని పాత్రికేయులందరికీ రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు మంత్రి పల్లె రఘునాథరెడ్డి చె ప్పారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాల యంలో శనివారం భేటీ అనంతరం పల్లె మీడియాతో మాట్లాడారు. సమావేశంలో పాత్రి కేయుల సంక్షేమంపై సీఎం దృష్టి సారించారని తెలిపారు. జిల్లాల వారీగా అర్హతలు ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలోని పాత్రికేయులందరికీ ఇప్పటికే హెల్త్‌ కార్డులు అందజేశామని తెలిపారు. ప్రమాదం తీవ్రంగా గాయపడినా, శాశ్వత వైకల్యం కలిగినా బీమా క్లెయిమ్‌ చేసుకోవచ్చన్నారు. దీనికి రూ.400 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో రూ.200 జర్నలిస్టులు చెల్లించాలన్నారు.
Tags:    
Advertisement

Similar News