కుక్కను పట్టాలకు కట్టేసి చంపిన యువకుడు
ఓ కుటుంబం అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఓ శునకాన్ని పొరుగింటి వ్యక్తి దారుణంగా హతమార్చాడు. పెంపుడు కుక్క అని కూడా చూడకుండా రైలు పట్టాలకు కట్టేసి మరీ దాని చావుకు కారణమయ్యాడు. హృదయవిదారకమైన ఈ ఘటన హైదరాబాద్‌లోని వారాసిగూడలో జరిగింది. వారాసిగూడ ఈశ్వరిబాయినగర్‌కు చెందిన రఘు (22) రెండేండ్ల క్రితం లాబ్రడర్ జాతికి చెందిన శునకాన్ని తెచ్చి పెంచుకుంటున్నారు. వారి ఇంటిపక్కనే ఉండే అన్వర్ (23) అనే పెయింటర్ ఈ నెల 18న రఘు ఇంట్లో ఉన్న […]
Advertisement
ఓ కుటుంబం అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఓ శునకాన్ని పొరుగింటి వ్యక్తి దారుణంగా హతమార్చాడు. పెంపుడు కుక్క అని కూడా చూడకుండా రైలు పట్టాలకు కట్టేసి మరీ దాని చావుకు కారణమయ్యాడు. హృదయవిదారకమైన ఈ ఘటన హైదరాబాద్‌లోని వారాసిగూడలో జరిగింది. వారాసిగూడ ఈశ్వరిబాయినగర్‌కు చెందిన రఘు (22) రెండేండ్ల క్రితం లాబ్రడర్ జాతికి చెందిన శునకాన్ని తెచ్చి పెంచుకుంటున్నారు. వారి ఇంటిపక్కనే ఉండే అన్వర్ (23) అనే పెయింటర్ ఈ నెల 18న రఘు ఇంట్లో ఉన్న శునకాన్ని తీసుకువెళ్లి జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ వద్ద రైలు పట్టాలకు కట్టేశాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు శునకాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. దానిని అన్వర్ అక్కడే వదిలేసి వస్తుండగా స్థానికుల సమాచారంతో రఘు కుటుంబసభ్యులు అన్వర్‌ను నిలదీశారు. దాంతో శునకం రైలు కిందపడి చనిపోయిందని బుకాయించాడు. దీంతో చేసేది లేక శునకాన్ని రైల్వేస్టేషన్ వద్దే పాతిపెట్టిన రఘు కుటుంబసభ్యులు, బ్లూక్రాస్ సంస్థకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. 19న శునకం కళేబరాన్ని బంజారాహిల్స్‌లోని ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లి పోస్ట్‌మార్టం చేయించి తిరిగి తీసుకొచ్చి పాతిపెట్టారు. శుక్రవారం చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రైవేటు దవాఖానలో చేసిన పోస్ట్‌మార్టం రిపోర్టు పనికిరాదని పోలీసులు తెలిపారు. దాంతో శునకం కళేబరాన్ని మరోసారి వెలికితీసి పాతిపెట్టిన చోటే ప్రభుత్వ వైద్యులతో మరోసారి పోస్ట్‌మార్టం జరిపించారు. ఈ ఘటనపై కేసు కేసు నమోదుచేసిన చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement