గోల్కొండ వద్ద పాత స్విమ్మింగ్ పూల్ పునర్నిర్మాణం " జీహెచ్‌ఎంసీ
చారిత్రక గోల్కొండ సమీపంలో శిథిలావస్థకు చేరిన పాత స్విమ్మింగ్ పూల్‌ను పునర్ నిర్మిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ శుక్రవారం ప్రకటించారు. కోటకు సమీపంలోని కటోరా హజ్ వద్దనున్నఈ ఈతకొలను నిజాం నవాబుల కాలం నాటింది. ఆరోజుల్లో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నపట్పికీ తర్వాత నిరాదరణకు గురైంది. ఇటీవల కాలంలో దీన్ని చెత్త డంప్ చేసే డంప్‌యార్డుగా ఉపయోగిస్తున్నారనే విషయం తమ దృష్టికి రావడంతో పునర్నిర్మాణ చర్యలు చేపట్టామని, అందుకోసం రూ. 1.25 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు కమిషనర్ […]
చారిత్రక గోల్కొండ సమీపంలో శిథిలావస్థకు చేరిన పాత స్విమ్మింగ్ పూల్‌ను పునర్ నిర్మిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ శుక్రవారం ప్రకటించారు. కోటకు సమీపంలోని కటోరా హజ్ వద్దనున్నఈ ఈతకొలను నిజాం నవాబుల కాలం నాటింది. ఆరోజుల్లో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నపట్పికీ తర్వాత నిరాదరణకు గురైంది. ఇటీవల కాలంలో దీన్ని చెత్త డంప్ చేసే డంప్‌యార్డుగా ఉపయోగిస్తున్నారనే విషయం తమ దృష్టికి రావడంతో పునర్నిర్మాణ చర్యలు చేపట్టామని, అందుకోసం రూ. 1.25 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. దీంతో పాటు నగరంలో క్షీణదశకు చేరిన పలు ఈత కొలనులను కాపాడేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. దురాక్రమణలకు గురవుతున్న స్విమ్మింగ్‌పూల్స్‌ను కాపాడి తిరిగి నిర్మిస్తామని ఆయన చెప్పారు.