బాబు " మోడీ మధ్య చెడిందా..?
సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మధ్య స్నేహం చెడిందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నరేంద్రమోడి తలచుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా నిమిషాల మీద వచ్చేస్తుందని కానీ ఆయన ఇవ్వాలనుకుంటున్నట్లు కనిపించడం లేదని నారాయణ అన్నారు. వెంకయ్యనాయుడుపైన కూడా నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య ఇక్కడ కోతలు కోస్తున్నాడే […]
సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మధ్య స్నేహం చెడిందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నరేంద్రమోడి తలచుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా నిమిషాల మీద వచ్చేస్తుందని కానీ ఆయన ఇవ్వాలనుకుంటున్నట్లు కనిపించడం లేదని నారాయణ అన్నారు. వెంకయ్యనాయుడుపైన కూడా నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య ఇక్కడ కోతలు కోస్తున్నాడే తప్ప కేంద్రంలో ఆయనకు అంత సీన్ లేదని చెప్పారు. మోడీ వద్ద వెంకయ్య పప్పులేమీ ఉడకడం లేదని నారాయణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు ఇద్దరూ రాష్ర్టానికి ద్రోహం చేస్తున్నారని నారాయణ విమర్శించారు.