హోదా వచ్చే వరకు ఆగదు పోరాటం: విజయసాయిరెడ్డి
ప్రత్యేక హోదా లభించే వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా లభిస్తే రాష్ట్రానికి వచ్చే నిధుల్లో 56.25 శాతం గ్రాంట్ల రూపంలో మిగులుతుందని ఆయన అన్నారు. శుక్రవారం విశాఖపట్నం జర్నలిస్టుల ఫోరంలో ఏర్పాటు చేసిన ట్రేడ్ యూనియన్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 29న తలపెట్టిన బంద్‌కు విశాఖ జిల్లాకు ఇన్‌ఛార్జిగా కూడా ఉన్న విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తమ బంద్‌కు అన్ని ట్రేడ్ […]
Advertisement
ప్రత్యేక హోదా లభించే వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా లభిస్తే రాష్ట్రానికి వచ్చే నిధుల్లో 56.25 శాతం గ్రాంట్ల రూపంలో మిగులుతుందని ఆయన అన్నారు. శుక్రవారం విశాఖపట్నం జర్నలిస్టుల ఫోరంలో ఏర్పాటు చేసిన ట్రేడ్ యూనియన్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 29న తలపెట్టిన బంద్‌కు విశాఖ జిల్లాకు ఇన్‌ఛార్జిగా కూడా ఉన్న విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తమ బంద్‌కు అన్ని ట్రేడ్ యూనియన్‌లు మద్దతిచ్చాయని తెలిపారు. పన్ను రాయితీలుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఎలా ఉంటుందో చంద్రబాబు బయటికి చెప్పాలని ఆయన డిమాండు చేశారు. ప్రత్యేక హోదాపై నిలదీసే శక్తి చంద్రబాబునాయుడుకు లేదని, బీజేపీతో తనకున్న సంబంధాలు ఎక్కడ తెగిపోతాయోనన్న భయంతో ఆయన ఉన్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నాయకుడు గౌతంరెడ్డి కూడా పాల్గొన్నారు.
Advertisement