నీటి చార్జీలు ఔట్‌సోర్సింగ్ ?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తప్ప రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో నల్లా బిల్లులు వసూలు చేయడంలో పురపాలక సంఘాలు విఫలమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నీటిబిల్లుల వసూళ్లను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పజెప్పాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో జీహెచ్ఎంసీని మినహాయిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికిగాను నీటి బిల్లులు కేవలం 6.90 శాతం మాత్రమే వసూలయ్యాయి. దీంతో ప్రభుత్వం నల్లా బిల్లుల వసూళ్ల బాధ్యతను ఔట్ సోర్సింగ్‌కు అప్పచెప్పాలని భావిస్తోంది. ఈ విధానాన్ని తొలుత […]
Advertisement
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తప్ప రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో నల్లా బిల్లులు వసూలు చేయడంలో పురపాలక సంఘాలు విఫలమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నీటిబిల్లుల వసూళ్లను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పజెప్పాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో జీహెచ్ఎంసీని మినహాయిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికిగాను నీటి బిల్లులు కేవలం 6.90 శాతం మాత్రమే వసూలయ్యాయి. దీంతో ప్రభుత్వం నల్లా బిల్లుల వసూళ్ల బాధ్యతను ఔట్ సోర్సింగ్‌కు అప్పచెప్పాలని భావిస్తోంది. ఈ విధానాన్ని తొలుత వరంగల్ కార్పోరేషనల్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. నల్లాబిల్లుల బాధ్యతను సెప్టెంబరు 1వ తేదీ నుంచి రెవిన్యూ విభాగానికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, నల్లా బిల్లలను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పురపాలకశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇకపై నీటి బిల్లుల చెల్లింపులు, బకాయిల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని ఆయన చెప్పారు.
Advertisement