మావోలు కలిసి వస్తే మంచిది: కవిత
బంగారు తెలంగాణ సాధనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అని, ఇద్దరి ఎజెండా ఒకటే అయినా మావోయిస్టులు ఎర్రజెండా కింద, మేం గులాబీ జెండా కింద పని చేయాల్సి వస్తోందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. పేదలకు న్యాయం చేసి, సమ సమాజాన్ని స్థాపించాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన ఉద్దేశమని, ఇదే లక్ష్యంతో అడవుల్లో ఉన్న మావోయిస్టులు కూడా సమాజంలోకి వచ్చి తమతో కలిసి పని చేయాలని ఆమె పిలుపు ఇచ్చారు. […]
Advertisement
బంగారు తెలంగాణ సాధనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అని, ఇద్దరి ఎజెండా ఒకటే అయినా మావోయిస్టులు ఎర్రజెండా కింద, మేం గులాబీ జెండా కింద పని చేయాల్సి వస్తోందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. పేదలకు న్యాయం చేసి, సమ సమాజాన్ని స్థాపించాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన ఉద్దేశమని, ఇదే లక్ష్యంతో అడవుల్లో ఉన్న మావోయిస్టులు కూడా సమాజంలోకి వచ్చి తమతో కలిసి పని చేయాలని ఆమె పిలుపు ఇచ్చారు. బంగారు తెలంగాణ సాధనలో మావోయిస్టులు కూడా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. మన ఊరు-మన ఎంపీలో నాలుగో రోజైన గురువారం కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి స్వగ్రామమైన బీర్‌పూర్ తదితర గ్రామాల్లో కవిత పర్యటించారు.
Advertisement