ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా డీఎస్‌

ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ధర్మపురి శ్రీనివాస్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా, జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పదవులు నిర్వహించిన డీ.శ్రీనివాస్‌ను ఈ పదవిలో నియమించడం ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరగలదని కేసీఆర్‌ ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా ఇటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలపై పట్టు కలిగిన డీఎస్‌కు ఈ పదవి ఇవ్వడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. […]

Advertisement
Update:2015-08-21 07:26 IST
ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ధర్మపురి శ్రీనివాస్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా, జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పదవులు నిర్వహించిన డీ.శ్రీనివాస్‌ను ఈ పదవిలో నియమించడం ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరగలదని కేసీఆర్‌ ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా ఇటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలపై పట్టు కలిగిన డీఎస్‌కు ఈ పదవి ఇవ్వడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈయన సేవలను అంతర్రాష్ట్ర సంబంధాలకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి ఇటీవలే టీఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్న డీఎస్‌కు కేసీఆర్‌ సముచిత పదవిని ఇచ్చి గౌరవించారని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News