చీప్ లిక్కర్ రద్దు చేసేవరకూ ఉద్యమం: ఐద్వా
ప్రభుత్వం చీప్ లిక్కర్‌ను రద్దు చేసే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన మద్యం పాలసీని రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఐద్వా చేపట్టిన బస్సు జాతా ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. ఈసందర్భంగా ఖమ్మం బస్‌స్టాండ్ సెంటర్లో జరిగిన సభలో పలువురు ఐద్వా నేతలు ప్రసంగించారు. మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేయడానికే చీప్ లిక్కర్‌ను ప్రవేశ పెడుతోందని, పదివేల కుటుంబాలకు ఒక […]
Advertisement
ప్రభుత్వం చీప్ లిక్కర్‌ను రద్దు చేసే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన మద్యం పాలసీని రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఐద్వా చేపట్టిన బస్సు జాతా ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. ఈసందర్భంగా ఖమ్మం బస్‌స్టాండ్ సెంటర్లో జరిగిన సభలో పలువురు ఐద్వా నేతలు ప్రసంగించారు. మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేయడానికే చీప్ లిక్కర్‌ను ప్రవేశ పెడుతోందని, పదివేల కుటుంబాలకు ఒక మద్యం షాపు పెట్టడం వల్ల వేలాది కుటుంబాలు నాశనమవుతాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఐద్వా చేపట్టిన బస్సు జాతాకు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణకు బదులు మద్యం తెలంగాణగా మారుస్తున్నారని ఆయన విమర్శించారు.
Advertisement