ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫికేషన్ జారీ
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం నిరుద్యోగ సివిల్ ఇంజనీర్లకు దక్కనుంది. 770 సివిల్ ఇంజనీరింగ్ (ఏఇఇ) పోస్టులను భర్తీ నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్సీ) విడుదల చేసింది. ఈ సందర్భంగా టిఎస్‌పిఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మీడియాతో మాట్లాడారు. ఏఇఇ పరీక్షల కోసం మొదటిసారిగా ఆన్‌లైన్ పరీక్షా విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. ఏఇఇ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్ధులకు వచ్చే నెల 20వ తేదీన […]
Advertisement
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం నిరుద్యోగ సివిల్ ఇంజనీర్లకు దక్కనుంది. 770 సివిల్ ఇంజనీరింగ్ (ఏఇఇ) పోస్టులను భర్తీ నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్సీ) విడుదల చేసింది. ఈ సందర్భంగా టిఎస్‌పిఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మీడియాతో మాట్లాడారు. ఏఇఇ పరీక్షల కోసం మొదటిసారిగా ఆన్‌లైన్ పరీక్షా విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. ఏఇఇ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్ధులకు వచ్చే నెల 20వ తేదీన 450 మార్కులకు ఆన్‌లైన్‌లో రాత పరీక్షను నిర్వహించి 25వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పారు. ఆ తర్వాత 50 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలను నిరుద్యోగులు టిఎస్‌పిఎస్సీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆయన చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్ ఏఇఇల పోస్టులకు అప్లికేషన్లను వచ్చేనెల 3వ తేదీ వరకు స్వీకరిస్తామని, బిఇ లేదా బిటెక్ పట్టభద్రులు అర్హులని ఆయన చెప్పారు. అభ్యర్ధులు తమ దరఖాస్తును ఆన్‌లైన్ లో పంపాలని ఆయన సూచించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ నుంచి 418 పోస్టులు, ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరంగ్ శాఖలో 121 పోస్టులు, మున్సిపల్ ఏఇఇలు 5, రోడ్లు భవనాల శాఖలో 83, నీటిపారుదల శాఖ నుంచి 143 పోస్టుల చొప్పున మొత్తం 770 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశామని చక్రపాణి చెప్పారు. అభ్యర్ధుల కేటగిరీ ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉందని ఆయన వెల్లడించారు. జనరల్ అభ్యర్ధులు 18 నుంచి 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, ఇన్ సర్వీస్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ)లకు 54, వికలాంగులకు 54 ఏళ్లు, ఇన్ సర్వీస్ వికలాంగులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) లకు 58 ఏళ్ల వరకూ వయోపరిమితి ఉందని చెప్పారు.
Advertisement