రాద్దాంతమెందుకు పవన్: రావెల

ఏపీ రాజధాని భూ సేకరణపై రాద్దాంతం చేయవద్దని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు మంత్రి రావెల కిశోర్‌ బాబు హితవు చెప్పారు. పవన్‌ ట్వీట్‌కి స్పందించిన ఆయన అభివృద్ధికి అడ్డు తగలవద్దని సూచించారు. రాజధాని విషయంలో పవన్ సలహాలు, సూచనలు పరిశీలిస్తామన్నారు. గతంలో అనేక పథకాలకు, ప్రాజెక్టులకూ భూ సేకరణ జరిగిందని, మూడు వేల ఎకరాలకే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. మిగతా భూమి కోసం భూ సేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామన్నారు. 21వ […]

Advertisement
Update:2015-08-20 11:54 IST
ఏపీ రాజధాని భూ సేకరణపై రాద్దాంతం చేయవద్దని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు మంత్రి రావెల కిశోర్‌ బాబు హితవు చెప్పారు. పవన్‌ ట్వీట్‌కి స్పందించిన ఆయన అభివృద్ధికి అడ్డు తగలవద్దని సూచించారు. రాజధాని విషయంలో పవన్ సలహాలు, సూచనలు పరిశీలిస్తామన్నారు. గతంలో అనేక పథకాలకు, ప్రాజెక్టులకూ భూ సేకరణ జరిగిందని, మూడు వేల ఎకరాలకే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. మిగతా భూమి కోసం భూ సేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామన్నారు. 21వ శతాబ్దపు రాజధానిని నిర్మాణం చేస్తామని మంత్రి రావెల పేర్కొన్నారు. ఇప్పటి వరకు 33 వేల ఎకరాల భూమిని సేకరించామని ఎక్కడైనా స్వచ్చందంగా 33వేల ఎకరాల భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు.
Tags:    
Advertisement

Similar News