ప్రతిష్టంభనలో రాజధాని భూసేకరణ ?
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కోసం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. భూ సమీకరణ ద్వారా సేకరించిన భూమి సరిపోదని, భూసేకరణ చట్టాన్ని ఉపయోగించి మరో ఐదువేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెల్సిందే. తొలివిడతగా తుళ్లూరులో 700 ఎకరాలు, మంగళగరి, తాడేపల్లి మండలాలలో 1545 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం భావించింది. సమీకరణకు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసిపోయింది. 20వ తారీఖున భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర […]
Advertisement
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కోసం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. భూ సమీకరణ ద్వారా సేకరించిన భూమి సరిపోదని, భూసేకరణ చట్టాన్ని ఉపయోగించి మరో ఐదువేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెల్సిందే. తొలివిడతగా తుళ్లూరులో 700 ఎకరాలు, మంగళగరి, తాడేపల్లి మండలాలలో 1545 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం భావించింది. సమీకరణకు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసిపోయింది. 20వ తారీఖున భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఒకవైపు ప్రతిపక్షాలు భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళనలను ముమ్మరం చేశాయి. అదే సమయంలో మిత్రపక్షమైన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల తరచుగా భూసేకరణ వద్దంటూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు సేకరణను వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు రోజూ ఆందోళనలకు దిగుతున్నారు. బలవంతపు భూసేకరణను అడ్డుకుని తీరతామని వైఎస్ఆర్‌సీపీ ఇదివరకే ప్రకటించింది. అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో రైతులను సమీకరించి ఉద్యమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూసేకరణ బలవంతంగా చేస్తే ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అయితే తాడేపల్లి, పెనుమాక మండలాలలోని రైతులతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని అధికారులంటున్నారు. వారు గనుక సమీకరణకు ఒప్పుకుంటే భూసేకరణకు వెళ్లాల్సిన పనిలేదని చెబుతున్నారు. అందుకోసం భూ సేకరణ నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ వేసి భూ సమీకరణకు గాను మరికొంత కాలం గడువిస్తే మేలని అధికారులు ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు.
Advertisement