ఇక ప్రతి గ్రామానికీ ఓ ఫేస్‌బుక్ అకౌంట్
టీ.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతికి సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ను కూడా జోడించనుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కో ఫేస్‌బుక్ పేజీని ఆవిష్కరించేందుకు ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కసరత్తు పూర్తయింది. ఈ ఫేస్‌బుక్ పేజీలో గ్రామజ్యోతి కోసం సిద్ధం చేసిన ప్రణాళికలు, చేపడుతున్న అభివృద్ధి పనులు,భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల వివరాలతో పాటు యూజర్‌కు నచ్చిన గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి విరాళం, ఇతర కార్యక్రమాలను చేపట్టేందుకు […]
Advertisement
టీ.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతికి సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ను కూడా జోడించనుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కో ఫేస్‌బుక్ పేజీని ఆవిష్కరించేందుకు ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కసరత్తు పూర్తయింది. ఈ ఫేస్‌బుక్ పేజీలో గ్రామజ్యోతి కోసం సిద్ధం చేసిన ప్రణాళికలు, చేపడుతున్న అభివృద్ధి పనులు,భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల వివరాలతో పాటు యూజర్‌కు నచ్చిన గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి విరాళం, ఇతర కార్యక్రమాలను చేపట్టేందుకు ఫేస్‌బుక్ పేజీని వేదికగా ఉపయోగించుకోవచ్చు. ఎన్నారైలు, ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు నేరుగా తమ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు.
Advertisement