ఆంధ్రాకు సోమేష్‌కుమార్ కేటాయింపు సబబే
గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయించడం సబబేనని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)కు కేంద్రం తెలిపింది. తెలంగాణ, ఏపీల మధ్య ఐఏఎస్ అధికారుల కేటాయింపుల్లో భాగంగానే సోమేశ్‌ను ఏపీకి కేటాయించామని కేంద్రం క్యాట్‌కు వివరించింది. ప్రత్యూష్‌సిన్హా కమిటీ మార్గదర్శకాలు, కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ ( డీవోపీటీ) నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ జరిగిందని వెల్లడించింది. అయితే, కేంద్ర వైఖరిపై సోమేశ్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఏఏస్ అధికారుల […]
Advertisement
గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయించడం సబబేనని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)కు కేంద్రం తెలిపింది. తెలంగాణ, ఏపీల మధ్య ఐఏఎస్ అధికారుల కేటాయింపుల్లో భాగంగానే సోమేశ్‌ను ఏపీకి కేటాయించామని కేంద్రం క్యాట్‌కు వివరించింది. ప్రత్యూష్‌సిన్హా కమిటీ మార్గదర్శకాలు, కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ ( డీవోపీటీ) నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ జరిగిందని వెల్లడించింది. అయితే, కేంద్ర వైఖరిపై సోమేశ్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఏఏస్ అధికారుల కేటాయింపు అడ్వైజరీ కమిటీలో పీకే మహంతిని చేర్చడం చట్టవిరుద్దమని ఆయన కూతురు, అల్లుడు ఐఏఎస్ అధికారులని, వారు తుది కేటాయింపుల కోసం ఎదురుచూస్తుండగా, మహంతిని కమిటీలో చేర్చడం అనుమానాస్పదంగా ఉందని ఆయన వాదించారు. విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
Advertisement