పాసయితేనే పైతరగతికి: కేంద్రమంత్రి
విద్యార్ధులు 8వ తరగతి వరకు పాసైనా కాకున్నా పైతరగతికి పంపే నో డిటెన్షన్ విధానానికి చరమగీతం పాడడంతోపాటు ఉచిత నిర్భంద విద్యను పదో తరగతి వరకు విస్తరించాలని భావిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. నో డిటెన్షన్ విధానం వల్ల విద్యార్ధులు చదువులో వెనుకబడుతున్నారని ఆమె చెప్పారు. విద్యాహక్కులో ఉన్న ఈ విధానాన్ని పరిశీలించాల్సిందిగా పలు ప్రతిపాదనలు వచ్చినట్లు ఆమె చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రాల నుంచి స్పందనలు తెలుసుకున్న తర్వాతే […]
Advertisement
విద్యార్ధులు 8వ తరగతి వరకు పాసైనా కాకున్నా పైతరగతికి పంపే నో డిటెన్షన్ విధానానికి చరమగీతం పాడడంతోపాటు ఉచిత నిర్భంద విద్యను పదో తరగతి వరకు విస్తరించాలని భావిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. నో డిటెన్షన్ విధానం వల్ల విద్యార్ధులు చదువులో వెనుకబడుతున్నారని ఆమె చెప్పారు. విద్యాహక్కులో ఉన్న ఈ విధానాన్ని పరిశీలించాల్సిందిగా పలు ప్రతిపాదనలు వచ్చినట్లు ఆమె చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రాల నుంచి స్పందనలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆమె ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యపై కేంద్ర సలహా బోర్డు తొలి సమావేశంలో తెలిపారు.
Advertisement