250 మంది ఇంజనీర్లను వెనక్కు పంపిన ఏపీ
సాంకేతిక కారణాన్ని సాకుగా చూపించి 250 మంది నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఏపీ ప్రభుత్వం తెలంగాణకు తిప్పి పంపింది. మరో 150 మంది అధికారులను కూడా తిరిగి తెలంగాణకు పంపే అవకాశముందని అంచనా. ఏపీ స్థానికత కల్గిన వీరిని తెలంగాణపై బలవంతగా రుద్దుతోందని నీటిపారుదల శాఖ అధికారులు ఏపీ ప్రభుత్వంపై మండి పడుతున్నారు. దీంతో ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్తగా ఇంజనీర్ల వివాదం రాజుకోనుంది. ఉమ్మడి ప్రభుత్వ హయంలో జరిగిన తప్పుల వల్ల ఏపీ ఇంజనీర్లకు […]
Advertisement
సాంకేతిక కారణాన్ని సాకుగా చూపించి 250 మంది నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఏపీ ప్రభుత్వం తెలంగాణకు తిప్పి పంపింది. మరో 150 మంది అధికారులను కూడా తిరిగి తెలంగాణకు పంపే అవకాశముందని అంచనా. ఏపీ స్థానికత కల్గిన వీరిని తెలంగాణపై బలవంతగా రుద్దుతోందని నీటిపారుదల శాఖ అధికారులు ఏపీ ప్రభుత్వంపై మండి పడుతున్నారు. దీంతో ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్తగా ఇంజనీర్ల వివాదం రాజుకోనుంది. ఉమ్మడి ప్రభుత్వ హయంలో జరిగిన తప్పుల వల్ల ఏపీ ఇంజనీర్లకు తెలంగాణలో తిష్ట వేసే అవకాశం లభించడంతో పాటు ఏపీ ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే అవకాశం లభించిందని వారు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులకు ఇప్పుడు తాము మూల్యం చెల్లించాల్సి వస్తోందని, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా అధికారుల పెత్తనంతో తమకు ప్రమోషన్లు దక్కలేదని, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వారి పెత్తనమే కొనసాగుతోందని వాపోతున్నారు.
Advertisement