గోదావరిపై మరో ఆనకట్టకు సర్వే
వరంగల్ జిల్లా దేవాదుల ప్రాజెక్టుకు నీటికొరత ఏర్పడడంతో తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై మరో ఆనకట్టను నిర్మించాలని నిర్ణయించింది. దేవాదుల పథకం ఇన్టేక్ వెల్ ప్రాంతంలో నీటి నిల్వ ఉండక పోవడంతో మరో ప్రాజెక్టు అవసరమని ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక అందచేశారు. ఈ నివేదిక పై స్పందించిన ప్రభుత్వం వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం దుర్గంగుట్ట వద్ద 22 టిఎమ్‌సిల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. ఈ బ్యారేజీ నిర్మాణం కోసం సర్వే, సమగ్ర ప్రాజెక్టు […]
Advertisement
వరంగల్ జిల్లా దేవాదుల ప్రాజెక్టుకు నీటికొరత ఏర్పడడంతో తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై మరో ఆనకట్టను నిర్మించాలని నిర్ణయించింది. దేవాదుల పథకం ఇన్టేక్ వెల్ ప్రాంతంలో నీటి నిల్వ ఉండక పోవడంతో మరో ప్రాజెక్టు అవసరమని ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక అందచేశారు. ఈ నివేదిక పై స్పందించిన ప్రభుత్వం వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం దుర్గంగుట్ట వద్ద 22 టిఎమ్‌సిల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. ఈ బ్యారేజీ నిర్మాణం కోసం సర్వే, సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసేందుకు దేవాదుల ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు అనుమతినిస్తూ నీటిపారుదలశాఖ కార్యదర్శి జీవో జారీ చేసారు. సర్వేకు అవసరమైన రూ. 64.30 లక్షల నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది.
Advertisement