అమృత్ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు
కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) పథకం ద్వారా ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని టీ.ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కేంద్ర వాటా 50 శాతం, రాష్ట్ర వాటా 20 శాతం కాగా, మున్సిపాలిటీలు 30 శాతం ఖర్చు భరించాల్సి ఉంటుంది. మూడేళ్ల పాటు అమలయ్యే ఈ పథకాన్ని నగరాలు, పట్టణాల్లో నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి మున్సిపల్ […]
Advertisement
కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) పథకం ద్వారా ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని టీ.ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కేంద్ర వాటా 50 శాతం, రాష్ట్ర వాటా 20 శాతం కాగా, మున్సిపాలిటీలు 30 శాతం ఖర్చు భరించాల్సి ఉంటుంది. మూడేళ్ల పాటు అమలయ్యే ఈ పథకాన్ని నగరాలు, పట్టణాల్లో నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి మున్సిపల్ శాఖ అధికారులు గచ్చిబౌలిలోని సెంటర్ ఫర్ గుడ్‌గవర్నెన్స్ లోని అమృత్ సిటీస్‌లో సర్వీస్ లెవల్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ పై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.జీ గోపాల్ పాల్గొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే స్థానిక సంస్థలు మెరుగైన ఫలితాలు సాధించాలని, అమృత్ పథక నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించిన స్థానిక సంస్థలకు కేంద్రం 10 శాతం అదనపు నిధులు కేటాయిస్తుందని ఆయన చెప్పారు.
Advertisement