ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం
గోదావరిఖనిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లో ఇంటర్ విద్యార్ధుల హాజరు శాతాన్ని మెరుగు పరిచేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెట్టారు ప్రిన్సిపాల్ మాధవి. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అమలవుతున్న ఈ పథకాన్ని ఆమె మొదటిసారిగా కళాశాల విద్యార్ధుల కోసం అమలు చేస్తున్నారు. గోదావరిఖని బాలుర జూనియర్ కళాశాలకు దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్ధుల సంఖ్య అధికంగా ఉంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాలేజీలో ఉండాల్సి రావడంతో చాలా […]
Advertisement
గోదావరిఖనిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లో ఇంటర్ విద్యార్ధుల హాజరు శాతాన్ని మెరుగు పరిచేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెట్టారు ప్రిన్సిపాల్ మాధవి. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అమలవుతున్న ఈ పథకాన్ని ఆమె మొదటిసారిగా కళాశాల విద్యార్ధుల కోసం అమలు చేస్తున్నారు. గోదావరిఖని బాలుర జూనియర్ కళాశాలకు దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్ధుల సంఖ్య అధికంగా ఉంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాలేజీలో ఉండాల్సి రావడంతో చాలా మంది విద్యార్ధులు మధ్యాహ్నం తరగతులకు హాజరవడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన ప్రిన్సిపాల్ మాధవి జిల్లా అధికారుల అనుమతితో దాతల నుంచి విరాళాలు సేకరించి మొత్తం 800 మందికి పెరుగన్నం, చట్నీతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు.
Advertisement