బాబు మెడకు ఏసీబీ ఉచ్చు!
ఓటుకు నోటు కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జీషీట్ ఓ మీడియా ఛానల్‌కు దొరికింది. చంద్రబాబు మెడకు ఉచ్చు బిగుసుకుంటుందనే ఉహాగానాల నేపథ్యంలో ఈ చార్జీషీట్ ఎంతో కీలకం కానుంది. రేవంత్ ఇటీవల కోర్టుకు హాజరవుతూ అభియోగపత్రంలో అంశాలను చూసిన తర్వాత కేసీఆర్ సర్కార్ కుట్రను తాను బట్టబయలు చేస్తానని హెచ్చరించారు. అయితే ఇంకా కోర్టు వరకు ఈ అభియోగపత్రం వెళ్ళలేదు. అటు నిందుతులకూ దీని ప్రతి అందలేదు. ఈ నేపథ్యంలో మీడియాకు లీకైన చార్జీషీట్‌లో చంద్రబాబు […]
Advertisement
ఓటుకు నోటు కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జీషీట్ ఓ మీడియా ఛానల్‌కు దొరికింది. చంద్రబాబు మెడకు ఉచ్చు బిగుసుకుంటుందనే ఉహాగానాల నేపథ్యంలో ఈ చార్జీషీట్ ఎంతో కీలకం కానుంది. రేవంత్ ఇటీవల కోర్టుకు హాజరవుతూ అభియోగపత్రంలో అంశాలను చూసిన తర్వాత కేసీఆర్ సర్కార్ కుట్రను తాను బట్టబయలు చేస్తానని హెచ్చరించారు. అయితే ఇంకా కోర్టు వరకు ఈ అభియోగపత్రం వెళ్ళలేదు. అటు నిందుతులకూ దీని ప్రతి అందలేదు. ఈ నేపథ్యంలో మీడియాకు లీకైన చార్జీషీట్‌లో చంద్రబాబు పేరు ఉండటం టీడీపీ వర్గాల్లో కలవరం కలిగిస్తోంది.
చార్జీషీట్ లో పలు అంశాలు..
చార్జీషీట్‌లో ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయించే పనిని చంద్రబాబు తనకు అప్పగించారని రేవంత్ చెప్పడాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు తరపున తానే బేరసారాలు చేస్తున్నానన్న అంశాన్ని హైలైట్ చేశారు. నేరుగా స్టిఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడారని ఏసిబి వెల్లడించింది. దే బ్రీఫుడ్ మీ… అంటూ మొత్తం సంభాషణను చార్జీషీట్‌లో పొందుపరిచింది. ఇక జూన్ 2న సెల్‌ఫోన్ స్వీచాఫ్ చేయాలంటూ టీడీపీ నేతలు మత్తయ్యకు చెప్పారని… ఇదే విషయాన్ని మత్తయ్య ఎస్ఎంఎస్ చేశారంటూ ఆధారాలు సమర్పించింది. ఎస్.ఎం.ఎస్., వాట్సప్‌ల ద్వారా ఓటుకు నోటు పథక రచన చేసినట్టు ఏసీబీ స్పష్టం చేసింది. ఇక ఫోరెన్సిక్ సంస్థ ఇచ్చిన రిపోర్టును కోర్టు ముందు ఉంచామని చెబుతూనే దాని సంభాషణను సంక్షిప్తంగా చార్జీషీట్లలో పేర్కొంది. అయితే ఇంకా ఏసిబి మరింత దూకుడు పెంచడానికి ముందుగానే నిందితుడిగా చంద్రబాబు పేరును చేర్చేందుకు బలమైన ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement