శ్రీలంక ఎన్నికల్లో 70 శాతం పోలింగ్
శ్రీలంక పార్లమెంటుకు జరిగిన సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో 70 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ప్రభుత్వవర్గాలు ప్రకటించాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎన్నికల అనంతరం నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు చెబుతున్నాయి. 225 స్థానాల కోసం యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడం అలయన్స్ (యుపిఎఫ్ఎ), యునైటెడ్ నేషనల్ పార్టీ ( యుఎన్‌పి)లను రెండు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి. యుపిఎఫ్ఎ పార్టీ అభ్యర్ధి మాజీ అధ్యక్షుడు రాజపక్సే ఈసారి […]
Advertisement
శ్రీలంక పార్లమెంటుకు జరిగిన సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో 70 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ప్రభుత్వవర్గాలు ప్రకటించాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎన్నికల అనంతరం నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు చెబుతున్నాయి. 225 స్థానాల కోసం యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడం అలయన్స్ (యుపిఎఫ్ఎ), యునైటెడ్ నేషనల్ పార్టీ ( యుఎన్‌పి)లను రెండు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి. యుపిఎఫ్ఎ పార్టీ అభ్యర్ధి మాజీ అధ్యక్షుడు రాజపక్సే ఈసారి ప్రధాని పదవికి పోటీలో ఉన్నారు. అదేపార్టీకి చెందిన దేశాధ్యక్షుడు సిరిసేన రాజపక్సేకు ప్రధాని పదవి ఇవ్వరాదని తీర్మానించారు. అందుకోసం ఆయన ప్రతిపక్షనేతలతో చేతులు కలిపినట్టు సమాచారం. ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో మరికాసేపట్లో తేలనుంది.
Advertisement