డబ్బు యావతోనే డిజైన్ల మార్పు: లెఫ్ట్ నేతల ఫైర్
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వామపక్షనేతలు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డిలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం కనుక నీటి ప్రాజెక్టుల డిజైన్లను మార్చాలని భావిస్తే ఆయనకు కూర్చోడానికి సీఎం కుర్చీ లేకుండా చేస్తామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని హెచ్చరించారు. కంతనపల్లి ప్రాజెక్టు రద్దు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టును రద్దు చేస్తే ఏడున్నర వేల కోట్ల రూపాయలతో నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు వృధాగా మారుతుందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు దండుకోవడానికే ప్రాజెక్టుల […]
Advertisement
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వామపక్షనేతలు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డిలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం కనుక నీటి ప్రాజెక్టుల డిజైన్లను మార్చాలని భావిస్తే ఆయనకు కూర్చోడానికి సీఎం కుర్చీ లేకుండా చేస్తామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని హెచ్చరించారు. కంతనపల్లి ప్రాజెక్టు రద్దు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టును రద్దు చేస్తే ఏడున్నర వేల కోట్ల రూపాయలతో నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు వృధాగా మారుతుందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు దండుకోవడానికే ప్రాజెక్టుల డిజైన్లను మారుస్తున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల డిజైన్లపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement