బాబు మెడపై 'రియల్' కత్తి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంత హడావిడిగా విజయవాడకు అధికారులను ఎందుకు తరలిస్తున్నారు? వారంలో నాలుగురోజులు అక్కడే ఉండాలని ఎందుకు నిర్ణయించారు? విద్యా సంవత్సరం ప్రారంభమై మూడునెలలు గడచిపోయినందున పిల్లల చదువులకు ఇబ్బంది అని అధికారులు మొత్తుకుంటున్నా ఆయన ఎందుకు వినడం లేదు?… వీటన్నిటికీ ఒక్కటే సమాధానం వినిపిస్తోంది. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కదలిక తీసుకురావడానికే చంద్రబాబు ప్రయాస పడుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించి అక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని […]
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంత హడావిడిగా విజయవాడకు అధికారులను ఎందుకు తరలిస్తున్నారు? వారంలో నాలుగురోజులు అక్కడే ఉండాలని ఎందుకు నిర్ణయించారు? విద్యా సంవత్సరం ప్రారంభమై మూడునెలలు గడచిపోయినందున పిల్లల చదువులకు ఇబ్బంది అని అధికారులు మొత్తుకుంటున్నా ఆయన ఎందుకు వినడం లేదు?… వీటన్నిటికీ ఒక్కటే సమాధానం వినిపిస్తోంది. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కదలిక తీసుకురావడానికే చంద్రబాబు ప్రయాస పడుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్ నారు. తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించి అక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని చంద్రబాబు చాలా కాలం క్రితమే చెప్పారు. అయితే అధికారులను, మంత్రిత్వ శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేయకుండా, అక్కడ ముఖ్యమంత్రి నివాసం ఉండకుండా పరిపాలన ఏమిటని ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబుపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల వత్తిడి చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి సహకరించిన బడాబాబులు అనేకమందికి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వందలాది ఎకరాలు ఉన్నాయి. రాజధాని చుట్టూ వారి భూములకు విలువ అమాంతంగా పెరిగిపోయింది. అయితే రియల్ లావాదేవీలు మాత్రం అంతగా ఊపందుకోలేదు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో కొత్త ఇల్లు కట్టుకుంటుండడం, హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి కోట్లు ఖర్చు చేసి కొత్త హంగులు ఏర్పాటు చేయడం వంటివి ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్తబ్దత రావడానికి కారణమయ్యాయి. స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బూమ్ తెచ్చేందుకు చంద్రబాబు నడుం బిగించారు. తనను నమ్మి ఆ రెండు జిల్లాల్లో భూములు కొనుగోలు చేసి భారీగా పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు, సన్నిహితులు, అనుయాయూలకు ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకే ఆయన హడావిడిగా విజయవాడ నుంచి పాలన సాగించడానికి సమాయత్తమవుతున్నారు. తెలంగాణాలో ఓటుకు నోటు, కెసిఆర్ ప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్‌కు భయపడి చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్నట్టుండి మకాం మార్చారనే ప్రచారం కూడా ఉండనే ఉంది. అయితే ఆ కారణం కంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రియల్ వ్యాపారుల ప్రభావమే ప్రధానమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. చావో రేవో అన్నట్లుగా జరిగిన 2014 ఎన్నికల్లో అనేక దేశాల్లోని ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా పెద్ద ఎత్తున సహాయం చేశారు. వారికి కొత్త రాజధాని గురించిన స్పష్టమైన హామీ ఇవ్వడంతో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. కోట్లు వెచ్చించి భూములపై పెట్టుబడులు పెట్టిన ఎన్ఆర్ ఐలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చంద్రబాబుపై విపరీతమైన వత్తిడి తీసుకురావడంతో ఆయన ఈ తరలింపు ప్రక్రియను తలకెత్తుకున్నారని వినిపిస్తోంది. అంటే బాబుగారి గాబరా పాలనపైన కాదన్నమాట.. రియల్ ఎస్టేట్ కమిట్‌మెంట్స్ కంప్లీట్ చేయడానికేనని అర్ధం కావడం లేదూ..!
Advertisement