హద్దులు దాటిన పాక్ సైన్యం ఆగడాలు
భారత భూభాగంపై పాక్ సైనికుల ఆగడాలు హద్దు మీరుతున్నాయి. భారత్ పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ భూభాగంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించిన పాక్ సైన్యం వరుసగా 8వ రోజు కూడా కాల్పులకు తెగబడింది. పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో గత రెండు రోజుల్లోనే ఆరుగురు పౌరులు మరణించారు. ఆదివారం పూంచ్, రాజౌరీ, బాలాకోట్, హమీర్పూర్, మండీ సెక్టార్లపై విచక్షణారహితంగా మోర్టారు, బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో నసరత్ బేగం(35) అనే మహిళ మృతి చెందగా, […]
Advertisement
భారత భూభాగంపై పాక్ సైనికుల ఆగడాలు హద్దు మీరుతున్నాయి. భారత్ పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ భూభాగంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించిన పాక్ సైన్యం వరుసగా 8వ రోజు కూడా కాల్పులకు తెగబడింది. పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో గత రెండు రోజుల్లోనే ఆరుగురు పౌరులు మరణించారు. ఆదివారం పూంచ్, రాజౌరీ, బాలాకోట్, హమీర్పూర్, మండీ సెక్టార్లపై విచక్షణారహితంగా మోర్టారు, బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో నసరత్ బేగం(35) అనే మహిళ మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై భారత్ మండిపడింది. విదేశాంగ కార్యదర్శి ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను తన కార్యాలయానికి పిలిపించి నిరసన వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో శాంతికి తూట్లు పడకుండా పాక్ తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Advertisement