అమెరికా యువతిపై ఐఎస్ నేత లైంగిక దాడి
అమెరికాకు చెందిన మానవహక్కుల కార్యకర్త కాయ్‌లా మ్యూలర్‌ను కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆమె చనిపోయే వరకు ఏడాదిన్నరపాటు ఐఎస్ఐఎస్ అగ్రనేత అబూబకర్ అల్ బాగ్దాదీ లైంగికదాడి చేశాడని మ్యూలర్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈనెల 14న మ్యూలర్ 27వ పుట్టినరోజు సందర్భంగా వారు ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మ్యూలర్‌ను 2013వ సంవత్సరం ఆగస్టు 4 వ తేదీన ఐఎస్ తీవ్రవాదులు సిరియాలోని ఆమె పని చేస్తున్న హాస్పటల్ వద్ద కిడ్నాప్ చేసి అక్కడే ఓ రహస్య […]
Advertisement
అమెరికాకు చెందిన మానవహక్కుల కార్యకర్త కాయ్‌లా మ్యూలర్‌ను కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆమె చనిపోయే వరకు ఏడాదిన్నరపాటు ఐఎస్ఐఎస్ అగ్రనేత అబూబకర్ అల్ బాగ్దాదీ లైంగికదాడి చేశాడని మ్యూలర్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈనెల 14న మ్యూలర్ 27వ పుట్టినరోజు సందర్భంగా వారు ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మ్యూలర్‌ను 2013వ సంవత్సరం ఆగస్టు 4 వ తేదీన ఐఎస్ తీవ్రవాదులు సిరియాలోని ఆమె పని చేస్తున్న హాస్పటల్ వద్ద కిడ్నాప్ చేసి అక్కడే ఓ రహస్య స్థావరంలో బందీగా ఉంచారు. ఆ సమయంలో అల్ బాగ్దాదీ మ్యూలర్‌ను బలవంతంగా లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జోర్డాన్ జరిపిన వైమానిక దాడిలో మ్యూలర్ మరణించిందని వారు తెలిపారు. మ్యూలర్‌పై బాగ్దాదీ లైంగిక దాడి జరిపిన విషయాన్ని ఆస్థావరంలో కొంతకాలం బందీలుగా ఉన్న ఇద్దరు కుర్దూ యువతులు, అబూ సయ్యఫ్ భార్య ఉమ్మా సయ్యఫ్ కూడా నిర్ధారించారని వారు చెప్పారు.
Advertisement