ఫీజు రీయింబర్స్‌ చేయండి: సీపీఐ

తెలంగాణలో పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణం విడుదల చేయాలని సీపీఐ శాసనసభాపక్ష నేత రవీంద్రకుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యా సంవత్సరం ముగిసి మూడు నెలలైనా ఫీజు అందక విద్యార్థులతోపాటు కళాశాలలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 300 కోట్లు విడుదల చేస్తే మిగతా విద్యార్థుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. విద్యాసంస్థలకు దాదాపు రూ. 2000 కోట్ల బకాయిలున్న విషయాన్ని పట్టించుకోకుండా విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకోవడం […]

Advertisement
Update:2015-08-16 18:39 IST
తెలంగాణలో పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణం విడుదల చేయాలని సీపీఐ శాసనసభాపక్ష నేత రవీంద్రకుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యా సంవత్సరం ముగిసి మూడు నెలలైనా ఫీజు అందక విద్యార్థులతోపాటు కళాశాలలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 300 కోట్లు విడుదల చేస్తే మిగతా విద్యార్థుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. విద్యాసంస్థలకు దాదాపు రూ. 2000 కోట్ల బకాయిలున్న విషయాన్ని పట్టించుకోకుండా విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన అన్నారు.
Tags:    
Advertisement

Similar News