నిందితులకు ఐపీఎస్‌ల షెల్టర్ !
ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ వద్ద ఆధారాలు ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు మరలా ఊపందుకుంది. ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితులు మత్తయ్య, జిమ్మీ, కొండల్‌రెడ్డిలకు ఎవరు ఆశ్రయమిచ్చారో తెలంగాణ ఏసీబీ అధికారులకు తెలిసిపోయింది. వారికి ఆంధ్రప్రదేశ్ పోలీసులే షెల్టర్ ఇచ్చినట్లు పక్కా ఆధారాలను వారు సేకరించారని సమాచారం. నిందితుల కాల్‌డేటాను పరిశీలించిన ఏసీబీ అధికారులు వాటి ఆధారంగా పలువురు ఏపీ పోలీసులకు ఇపుడు సమన్లు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులనే విచారణకు పిలవడం […]
Advertisement
ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ వద్ద ఆధారాలు
ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు మరలా ఊపందుకుంది. ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితులు మత్తయ్య, జిమ్మీ, కొండల్‌రెడ్డిలకు ఎవరు ఆశ్రయమిచ్చారో తెలంగాణ ఏసీబీ అధికారులకు తెలిసిపోయింది. వారికి ఆంధ్రప్రదేశ్ పోలీసులే షెల్టర్ ఇచ్చినట్లు పక్కా ఆధారాలను వారు సేకరించారని సమాచారం. నిందితుల కాల్‌డేటాను పరిశీలించిన ఏసీబీ అధికారులు వాటి ఆధారంగా పలువురు ఏపీ పోలీసులకు ఇపుడు సమన్లు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులనే విచారణకు పిలవడం సంచలనంగా మారబోతున్నది. ఓటుకు కోట్లు కేసులో ఏ 4గా ఉన్న మత్తయ్య నుంచి తాజాగా లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి వరకు ఏసీబీ విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. వీరి ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించిన ఏసీబీ అధికారులు వారు తరచుగా ఏపీ పోలీసు అధికారులు, టీడీపీ నాయకులతో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. దాంతో ఏపీ పోలీసు అధికారులకు, వారితో పాటు టీడీపీ నాయకులకు కూడా సమన్లు ఇచ్చి విచారణకు పిలిపించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు ప్రారంభమైనప్పటినుంచి రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌తోపాటు జిమ్మీబాబుతో టీడీపీలోని కీలక హోదాలో ఉన్న నలుగురు నేతలు మాట్లాడినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్నారని, వారు నిందితులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారని పక్కా ఆధారాలు లభించినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఆ ముగ్గురు ఐపీఎస్‌లను విచారణకు పిలుస్తామని, అవసరమైతే కోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి అనుమతులు పొందుతామని అంటున్నారు..
Advertisement