మావోయిస్టు నేత చంద్రమౌళికి యావజ్జీవ శిక్ష
మధ్యప్రదేశ్ లో అప్పటి రవాణాశాఖ మంత్రిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళి ఉరఫ్ మదన్‌లాల్‌కు బాల్ గఢ్ కోర్టు జీవితఖైదు విధించింది. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌కు చెందిన ఉగ్గె కనకయ్య సూరమ్మల పెద్ద కొడుకు చంద్రమౌళి. పదో తరగతిలోనే పీపుల్స్‌వార్ ఉద్యమానికి ఆకర్షితుడై ఆ పార్టీలో చేరాడు. అప్పటి నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్రకమిటీ సభ్యుడుగా మారాడు. పోలీసులు చంద్రమౌళిని మహారాష్ట్రలోని […]
Advertisement
మధ్యప్రదేశ్ లో అప్పటి రవాణాశాఖ మంత్రిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళి ఉరఫ్ మదన్‌లాల్‌కు బాల్ గఢ్ కోర్టు జీవితఖైదు విధించింది. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌కు చెందిన ఉగ్గె కనకయ్య సూరమ్మల పెద్ద కొడుకు చంద్రమౌళి. పదో తరగతిలోనే పీపుల్స్‌వార్ ఉద్యమానికి ఆకర్షితుడై ఆ పార్టీలో చేరాడు. అప్పటి నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్రకమిటీ సభ్యుడుగా మారాడు. పోలీసులు చంద్రమౌళిని మహారాష్ట్రలోని నాగపూర్ 2005వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన అరెస్ట్ చేశారు. అతడిపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఏపీల్లో మొత్తం 35 కేసులున్నాయి.
Advertisement