సీఎంల డుమ్మాకు కారణమేమిటో..?
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం నాడు జరిపిన ఎట్ హోం కార్యక్రమానికి ఇద్దరు చంద్రులు డుమ్మా కొట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ కార్యక్రమానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరికీ గవర్నర్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. అయినా ఇద్దరూ గైర్హాజరయ్యారు. ఇటీవలే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మన రాష్ర్టానికి వచ్చిన సందర్భంగా కూడా గవర్నర్ ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహించి ఇద్దరు సీఎంలను ఆహ్వానించారు. ఆ […]
Advertisement
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం నాడు జరిపిన ఎట్ హోం కార్యక్రమానికి ఇద్దరు చంద్రులు డుమ్మా కొట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ కార్యక్రమానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరికీ గవర్నర్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. అయినా ఇద్దరూ గైర్హాజరయ్యారు. ఇటీవలే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మన రాష్ర్టానికి వచ్చిన సందర్భంగా కూడా గవర్నర్ ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహించి ఇద్దరు సీఎంలను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి చంద్రబాబు ఒక్కరే హాజరయ్యారు. తనకు జ్వరంగా ఉండడం వల్ల రాలేకపోతున్నానని కేసీఆర్ గవర్నర్‌కు వర్తమానం పంపించారు. అయితే ఇపుడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలాంటి వర్తమానం లేకుండానే గైర్హాజరు కావడం సంచలనంగా మారింది. గవర్నర్ ఇచ్చే విందుకు ముఖ్యమంత్రి తప్పనిసరిగా హాజరవుతుంటారు. అది ఒక సంప్రదాయం. ఎన్ని పనులున్నా, అపాయింట్‌మెంట్‌లున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి ఆ కార్యక్రమానికి హాజరు కావడం రివాజు. ఇపుడు నరసింహన్ రెండు రాష్ర్టాలకు గవర్నర్‌గా ఉన్నారు. ఇద్దరు సీఎంలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారో అంతుపట్టడం లేదని మీడియావారు చర్చించుకోవడం కనిపించింది. వారు చర్చించుకోవడమే కాదు అదే విషయాన్ని గవర్నర్ దృష్టికి కూడా తీసుకువచ్చారు. అయితే ఆయన దానిని తేలికగా కొట్టిపడేశారు. ఏవో పనులుండడం వల్ల వారు రాలేకపోయి ఉంటారని అన్నారు. వారెందుకు నేనున్నానుగా.. నేనున్నాను… మీరున్నారు.. చాలదా అని ఆయన విలేకరులతో సరదాగా అన్నారు. తన మనవళ్లు ఇద్దరు ముఖ్యమంత్రులతో ఫొటోలు దిగాలనుకున్నారని, వారు రాకపోవడంతో మనవళ్లు నిరాశకు గురయ్యారని నరసింహన్ తెలిపారు.
Advertisement