నల్గొండ జిల్లాలో బాపూజీ ఆలయం
దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగక శాంతిగా పోరాటం చేసిన మహాత్ముడికి నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో ఆలయం నిర్మిస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పెద్దకాపర్తి శివారులో నిర్మించిన ఈ గుడి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రపంచదేశాలు గుర్తించిన గాంధేయ సిద్ధాంతానికి నిదర్శనంగా నిలిచే గుడి నిర్మాణానికి నర్సరావుపేటకు చెందిన మహత్మాగాంధీ చారిటబుల్ ట్రస్టు శ్రీకారం చుట్టింది. 2012 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు భూమి పూజ చేయగా, 2014సెప్టెంబర్15న మహాత్ముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సర్వమతాలను గౌరవిస్తూ […]
Advertisement
దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగక శాంతిగా పోరాటం చేసిన మహాత్ముడికి నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో ఆలయం నిర్మిస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పెద్దకాపర్తి శివారులో నిర్మించిన ఈ గుడి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రపంచదేశాలు గుర్తించిన గాంధేయ సిద్ధాంతానికి నిదర్శనంగా నిలిచే గుడి నిర్మాణానికి నర్సరావుపేటకు చెందిన మహత్మాగాంధీ చారిటబుల్ ట్రస్టు శ్రీకారం చుట్టింది. 2012 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు భూమి పూజ చేయగా, 2014సెప్టెంబర్15న మహాత్ముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సర్వమతాలను గౌరవిస్తూ ఆరు మతాల గ్రంథాలను అందుబాటులో ఉంచారు.
Advertisement