కేంద్ర సాయంతోనే అగ్రగామిగా ఏపీ: చంద్రబాబు
విభజిత ఆంద్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు కేంద్రంతో సహా అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో దేశ 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా, అన్యాయంగా విడగొట్టారని, దీనివల్ల కలిగిన నష్టాలను అధిగమించి, ఇతర రాష్ట్రాలతో పోటీ పడే వరకు కేంద్రం తమకు అన్ని విధాలా సహకరించాల్సి ఉందన్నారు. ఏపీ సీఎం. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తగిన సహకారం అందజేస్తారని […]
Advertisement
విభజిత ఆంద్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు కేంద్రంతో సహా అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో దేశ 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా, అన్యాయంగా విడగొట్టారని, దీనివల్ల కలిగిన నష్టాలను అధిగమించి, ఇతర రాష్ట్రాలతో పోటీ పడే వరకు కేంద్రం తమకు అన్ని విధాలా సహకరించాల్సి ఉందన్నారు. ఏపీ సీఎం. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తగిన సహకారం అందజేస్తారని ఆశిస్తున్నామన్నారు.
గతంలో కరెంట్ కోతలతో విలవిలలాడిన ఏపీని విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దగలిగామన్న ముఖ్యమంత్రి, పోలవరం పూర్తి కావడానికి మరో నాలుగైదేళ్లు పడుతుందన్నారు. అయితే అంతకన్నా ముందే కృష్ణా-గోదావరి నదీ జలాలను అనుసంధానిస్తామని, దానిలో భాగంగానే పట్టిసీమ ఎత్తిపోతలను ప్రారంభించామని చెప్పారు. పట్టిసీమను ఈరోజు జాతికి అంకితం చేస్తున్నామన్నారు. నదులను అనుసంధానం చేసుకుని ఏపీని కరువు రహిత రాష్ట్రంగా చేస్తామంటూ తద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌తో ముడిపడిన ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత ఎన్డీయేదేనన్న చంద్రబాబు, రూ.25 వేల కోట్ల మేర రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు. ఎంతోమంది త్యాగాల ఫలితమే నేడు మనం చూస్తున్న భారతదేశమని పేర్కొన్న చంద్రబాబు, బానిసత్వం నుంచి విముక్తి పొందిన ఈ రోజు పర్వదినమన్నారు. అమరుల త్యాగాలు వృథా పోనివ్వకూడదంటూ, మహనీయుల అడుగుజాడల్లో అందరూ నడవాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగ సమాజాన్ని పీడిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తామన్నారు. అందుకు నిదర్శనంగానే విశాఖపట్టణంలో ఈ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్రిటిష్ పాలకులపై అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేసిన నేల.. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని నినదించిన నేల ఇదేనని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ హుద్‌హుద్ తుఫాను వల్ల అతలాకుతలం అయిన ఈ ప్రాంతాన్ని వారంరోజుల్లోనే తీర్చిదిద్దామని చెప్పారు.
Advertisement