పనితీరులో నెం.1బాలయ్యను ప్రజలు నిలదీశారు!
నటనతోపాటు, పాలనలోనూ నెం.1 ర్యాంకును కైవసం చేసుకున్న హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఏపీలో ప్రజాప్రతినిధుల పనితీరుపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల సర్వే చేయించిన విషయం విదితమే. సర్వే ద్వారా ప్రజాప్రతినిధులకు నెం.1, నెం.2, నెం.3 అంటూ వివిధ రకాల ర్యాంకులు కూడా కేటాయించారు. అందులో హిందూపురం ఎమ్మెల్యేకు నెం.1 ర్యాంకు రావడం విశేషం. దీనిపై పలువురు టీడీపీ నేతలు పెదవి విరిచారు. నిత్యం పక్క రాష్ట్రంలో సినిమా షూటింగులతో […]
Advertisement
నటనతోపాటు, పాలనలోనూ నెం.1 ర్యాంకును కైవసం చేసుకున్న హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఏపీలో ప్రజాప్రతినిధుల పనితీరుపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల సర్వే చేయించిన విషయం విదితమే. సర్వే ద్వారా ప్రజాప్రతినిధులకు నెం.1, నెం.2, నెం.3 అంటూ వివిధ రకాల ర్యాంకులు కూడా కేటాయించారు. అందులో హిందూపురం ఎమ్మెల్యేకు నెం.1 ర్యాంకు రావడం విశేషం. దీనిపై పలువురు టీడీపీ నేతలు పెదవి విరిచారు. నిత్యం పక్క రాష్ట్రంలో సినిమా షూటింగులతో బిజీగా ఉండే బాలయ్యకు నెం.1 ర్యాంకు ఎలా వచ్చిందో అర్థం కాక, ప్రశ్నించే ధైర్యం లేక మిన్నకుండిపోయారు. ప్రజా పాలనలో నెం.1 గా నిలిచిన బాలయ్యను శుక్రవారం ఆయన నియోజకవర్గ మహిళలు నిలదీశారు. హిందూపురం పట్టణంలో రహదారి నిర్మాణం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణను మహిళలు చుట్టుముట్టి తమ బాధలను ఏకరువు పెట్టారు. కరువు కాటకాలతో తాము విలవిలాడిపోతున్నామని, తమకు ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. చుట్టుముట్టారు. దీంతో ఆయనకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కొద్దిసేపటి తరువాత తేరుకున్న బాలయ్య రెండునెలల తరువాత ఉపాధి కల్పిస్తానని చెప్పి వెళ్లిపోయారు. రెండు నెలల తరువాత ఉపాధి పనులు ఆగిపోతాయి కదా? అప్పుడెలా కల్పిస్తారు? అని మహిళలు వాపోయారు. ప్రజా పాలనలో నెం.1 గా నిలిచిన బాలయ్యకు నియోజకవర్గంలో ఏ పని ఎప్పుడు జరుగుతుందో తెలియకపోవడం విడ్డూరంగా ఉందని సొంతపార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. బాలకృష్ణకు ఫస్ట్ ర్యాంకు ఇచ్చారు అంటే ఆయన పనితీరు అందరికన్నా మెరుగ్గా ఉందని, నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలూ లేకుండా ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని అర్ధం. కానీ పరిస్థితి అక్కడ అందుకు భిన్నంగా ఉందని బాలయ్యకు తగిలిన షాక్ రుజువు చేస్తోంది.
Advertisement