దేవాదాయ శాఖ ఉద్యోగులకు పదో పీఆర్సీ
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పదో పీఆర్సీని వర్తింప చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరిస్తూ గురువారం ఫైల్‌పై సంతకం చేశారు. దీంతో దేవాదాయ శాఖ ఉద్యోగుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ లభించనుంది. అయితే, ప్రభుత్వ నిర్ణయం వల్ల కేవలం 5 వేల మంది మాత్రమే లబ్ధి పొందుతారని, మిగిలిన వారికి దేవాలయ ఆదాయంలో సిబ్బంది జీతభత్యాలు 30 శాతం మించకూడదన్న నిబంధనతో […]
Advertisement
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పదో పీఆర్సీని వర్తింప చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరిస్తూ గురువారం ఫైల్‌పై సంతకం చేశారు. దీంతో దేవాదాయ శాఖ ఉద్యోగుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ లభించనుంది. అయితే, ప్రభుత్వ నిర్ణయం వల్ల కేవలం 5 వేల మంది మాత్రమే లబ్ధి పొందుతారని, మిగిలిన వారికి దేవాలయ ఆదాయంలో సిబ్బంది జీతభత్యాలు 30 శాతం మించకూడదన్న నిబంధనతో నష్టపోతున్నారని వారు అంటున్నారు. అందువల్ల ప్రభుత్వం దేవాదాయ శాఖ ఉద్యోగులందరికీ ఏకీకృత జీత భత్యాల విధానం అమలు చేయాలని కోరుతున్నారు.
Advertisement