ట్యాపింగ్‌ డేటాను అందించిన సర్వీస్‌ ప్రొవైడర్లు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ట్యాపింగ్‌కు సంబంధించిన కాల్‌డేటాను విజయవాడ కోర్టుకు సర్వీస్‌ ప్రొవైడర్లు అందజేశారు. గతంలో 29 నెంబర్లకు సంబంధించిన కాల్‌డేటాను సమర్పించిన ఐడియా, ఎయిర్‌టెల్‌ సంస్థలు మరో 25 నెంబర్ల కాల్‌డేటాను అందజేశాయి. ఇందులో చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన కాల్‌డేటా కూడా ఉన్నట్లు సమాచారం. టాటా డొకొమో, వొడాఫోన్‌ సంస్థలు 29 నెంబర్లకు సంబంధించిన కాల్‌డేటాను గతంలోనే కోర్టుకు సమర్పించాయి. సర్వీస్‌ ప్రొవైడర్లు ఇచ్చిన సీల్ట్‌ కవర్లను స్పెషల్‌ మెసెంజర్ల […]

Advertisement
Update:2015-08-13 18:48 IST
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ట్యాపింగ్‌కు సంబంధించిన కాల్‌డేటాను విజయవాడ కోర్టుకు సర్వీస్‌ ప్రొవైడర్లు అందజేశారు. గతంలో 29 నెంబర్లకు సంబంధించిన కాల్‌డేటాను సమర్పించిన ఐడియా, ఎయిర్‌టెల్‌ సంస్థలు మరో 25 నెంబర్ల కాల్‌డేటాను అందజేశాయి. ఇందులో చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన కాల్‌డేటా కూడా ఉన్నట్లు సమాచారం. టాటా డొకొమో, వొడాఫోన్‌ సంస్థలు 29 నెంబర్లకు సంబంధించిన కాల్‌డేటాను గతంలోనే కోర్టుకు సమర్పించాయి. సర్వీస్‌ ప్రొవైడర్లు ఇచ్చిన సీల్ట్‌ కవర్లను స్పెషల్‌ మెసెంజర్ల ద్వారా అప్పట్లోనే హైకోర్టుకు పంపించారు. ఇప్పటి డేటాను కూడా హైకోర్టుకు పంపిస్తారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై తదుపరి విచారణను విజయవాడ కోర్టు సెప్టెంబర్‌ 11కు వాయిదా వేసింది.
Tags:    
Advertisement

Similar News