వద్దు... చెబుతున్నా... వినండి: పవన్‌కల్యాణ్‌

నవ్యాంధ్ర నిర్మాణం పేరుతో భూములను సేకరించడానికి చట్టాన్ని ప్రయోగించవద్దని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూముల్లో రాజధాని నిర్మిస్తే అందరికీ మంచిదని, అన్నదాతలను భయపెట్టి, చట్టాన్ని ప్రయోగించి భూసేకరణ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. భూ సేకరణ సామరస్య వాతావరణంలో జరగాలని, భూమిని లాక్కునేందుకు చట్టాన్ని ప్రయోగించవద్దని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన ట్వీట్‌ చేశారు. తన విన్నపాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని ఆశిస్తున్నానని ఆయన […]

Advertisement
Update:2015-08-14 03:04 IST

నవ్యాంధ్ర నిర్మాణం పేరుతో భూములను సేకరించడానికి చట్టాన్ని ప్రయోగించవద్దని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూముల్లో రాజధాని నిర్మిస్తే అందరికీ మంచిదని, అన్నదాతలను భయపెట్టి, చట్టాన్ని ప్రయోగించి భూసేకరణ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. భూ సేకరణ సామరస్య వాతావరణంలో జరగాలని, భూమిని లాక్కునేందుకు చట్టాన్ని ప్రయోగించవద్దని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన ట్వీట్‌ చేశారు. తన విన్నపాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని ఆశిస్తున్నానని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. గతంలో కూడా పవన్‌ కల్యాణ్‌ భూ సేకరణకు వ్యతిరేకంగా మాట్టాడారు. గుంటూరు వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడుతూ భూములను ప్రభుత్వం లాక్కుంటే తాను అండగా నిలబడతానని అభయమిచ్చారు. అయితే గుంటూరు నుంచి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ఆయన మాట మార్చి నిబంధనల ప్రకారమే ప్రభుత్వం భూములు తీసుకుంటుందని ప్రకటించారు. మార్చి 4న చేసిన ఓ ట్వీట్‌లో ‘రైతు కన్నీరు ఈ దేశానికి మంచిది కాదు. రైతులకు అండగా ఉంటాను’ అని అన్నారు. పవన్‌తో ఓ రైతు మాట్లాడుతూ ‘ఊళ్ళు కోసం రోడ్లు వేయడం చూశాంగాని, రోడ్డు కోసం ఊళ్ళు తీసెయ్యడం చూడలేద’ని రింగ్‌రోడ్డులో భూమి కోల్పోయిన ఓ పేద నిర్వాసితుడు గోడు వెళ్ళబోసుకున్నప్పుడు పవన్‌ దానికి ప్రతిస్పందిస్తూ ‘అభివృద్ధి అనేది సామాన్యుడిని భాగస్వామిని చేసేదిగా ఉండాలి కాని భయపెట్టేలా ఉండకూడద’ని వ్యాఖ్యానించారు. ఇదే వైఖరితో ఉంటే ఖచ్చితంగా గుంటూరు జిల్లాలో రైతులకు మేలు జరగడం ఖాయం. రాజధాని నిర్మాణానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ అటు రైతుల్లోను, ఇటు ప్రభుత్వంలోను వేగం పెరిగింది. సింగపూర్‌ బృందానికి భూములు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడింది. పైగా ఈ పార్లమెంటు సమావేశాల్లో భూ సేకరణ చట్టం బిల్లు ఆమోదం కాలేదు. దీన్ని శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. కాని గుంటూరు జిల్లాలో రాజధాని భూముల సేకరణకు అంత సమయం లేదు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం చట్టాన్ని ప్రయోగించి ఎలాగైనా భూములను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 34 వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారని తెలుగుదేశం ప్రభుత్వం చెబుతోంది. కాని నిజానికి ఇంకా 25 వేల ఎకరాలు కూడా రాలేదని అంటున్నారు. ప్రభుత్వానికి 40 వేల ఎకరాలు వివిధ అవసరాల కోసం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతుల నుంచి భూములను లాక్కోవడం ఒక్కటే ప్రభుత్వం దగ్గర మిగిలి ఉన్న ఆప్షన్‌. దీన్ని ప్రయోగించి భూములను స్వాధీనం చేసుకునే ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వం చేస్తోంది. సరిగ్గా ఈ సమయంలో పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటన అటు ప్రభుత్వంలోను, రాజకీయ వర్గాల్లోను ఆలోచనను రేకిత్తించక మానదు. పవన్‌ ఇపుడు తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటే ప్రభుత్వానికి ఇరకాటం తప్పకపోవచ్చు.

Tags:    
Advertisement

Similar News